కేంద్రం తీసుకున్న తెలంగాణ విభజన వివాదం దేశవ్యాప్త తలకాయనొప్పులకు ఆజ్యం పోసింది. చిరకాలంగా వున్న వేర్పాటు వాద డిమాండ్లు ఇప్పుడు ఈ దెబ్బకు ఊపందుకున్నాయి.ఒకటి కాదు రెండు కాదుఏకంగా నాలుగు రాష్ట్రాల్లో విభజన అంశం రగులుకుంది.

డార్జిలింగ్ లో నైతే మంగల్ సింగ్ అనే వ్యక్థి ప్రత్యేక గూర్ఖాలండ్ ఏర్పాటు చేయాలని ఆత్మ హత్యా యత్నం చేసాడు. దీంతో వేర్పాటు సెగ ఇప్పట్లో కేంద్ర కాంగ్రెస్ ను వదిలేలా లేదు. ఇది మరింతగా పెరిగే అవకాశం వుంది. మరొపక్క సమైక్య ఉద్యమం కూడా ఊపందుకోవడం పెద్ద సమస్య కాకపోయినా
తలకాయనొప్పే.

మహారాష్ట్రలో ప్రత్యేక విధర్బ ఏర్పాటు చేయాలని ఓ ఎంపీ సోనియాకు లేఖరాసారు. లేదంటే పరిస్థితులు విషమిస్తాయనిఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. గూర్ఖాలాండ్ కోసం బుదవారం ఉదయం నుంచి జిజేఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోలన జరుగుతోంది. ఇది హింసాత్మకంగా మారింది. జిజేఎం అద్యక్షుడు విమల్ గురు తన పదవికి రాజీనామా చేసారు.

మరోవైపు ఉత్తరప్రదేశ్ ను నాలుగురాష్ట్రాలు గా విభజించాలని తాజాగా అక్కడి ప్రజాప్రతినిధులు డిమాండ్ చేసారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల ముందు మాయావతి ఈ మేరకు తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపించింది.

ఇప్పుడు ఈ తలకాయనొప్పలన్నీ షురూ కావడం చూస్తంటే,  తెలంగాణ విభజనపై వీటి ప్రభావం పడుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.  మొత్తం మీద కాంగ్రెస్ కోరి తేనె తుట్టను కదిపినట్లయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: