కృష్ణా నది లో బోటు ప్రమాద ఘటన కి సంబందించిన మొట్టమొదటి వేటు ఇప్పుడే పడింది. మృతుల సంఖ్య 22 కి చేరిన నేపధ్యం లో గేదెల శ్రీను అనే ఉద్యోగిని సస్పెండ్, చేస్తూ పూర్తిగా విధుల నుండి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జరీ చేసింది.


ఇతను పర్యాటక శాఖ లో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. పడవ ప్రమాద ఘటన time లో పర్యాటక శాఖ కి ఇతను కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఉన్నాడు. ఈ ఘటన కి సంబంధించి ఇతని ప్రమేయం ఉంది అని ప్రాధమిక విచారణ లో తేలింది .రాష్ట్రంలోని బోటు ఆపరేటర్లతో నేడు సమావేశం నిర్వహించనున్నట్టు పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి ఎంకే మీనా తెలిపారు.


ఒంగోలు కి చెందిన వాకర్స్ క్లబ్ సభ్యులు ఆదివారం రెండు వాహనాల్లో బయలుదేరి దాదాపు అరవై మంది అమరావతి లోని అమరలింగేశ్వరుడిని దర్శించుకున్న అనంతరం విజయవాడ చేరుకుని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అక్కడి నుంచి పవిత్ర సంగమం వద్ద హారతి చూసేందుకు వెళ్తూ పలువురు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.


అయితే ఇలా కేవలం డ్రైవర్ లాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం కాకుండా పెద్ద తలకాయలు బయట పడాలి అనీ ఆ ప్రైవేటు బోటు సంస్థ యొక్క యజమానిని అరస్ట్ చెయ్యాలి అనీ ఆ టైం లో తీరంలో ఉన్న మ్యానేజ్మెంట్ ఎవరు వారి అలసత్వానికి కారణం ఎంటి అనేది కనుక్కుని వారందరి మీదా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ వినిపిస్తోంది 



మరింత సమాచారం తెలుసుకోండి: