ఎవరు కాదన్నా... సీమాంధ్రలో ఎంత చిచ్చు రేగుతున్నా..కాంగ్రేస్ తనపని తాను చేసుకుపోతోంది. ఆలస్యం అమృతం విషం అనుకుంటోందేమో.. అందుకే అధికారిక తంతును కూడా వేగవంతం చేసేసింది. రెండు,మూడు రోజుల్లో తెలంగాణ బిల్లు తీర్మానం కోసం రాష్ట్రఅసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.అసెంబ్లీకి

తీర్మానం కోసం పంపిన బిల్లు తిరిగి కేంద్రానికి పదిరోజుల్లోపు చేరుకోవాలి. ఆతర్వాత ప్రత్యేక క్యాబినెట్ సమావేశంలో ఆమోదించి లోక్ సభ, రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టాలన్నది కాంగ్రెస్ ప్రణాళిక. ఇక ఆరెండు సభల్లో సాధారణ మెజారిటితో ఆమోదింప చేసుకోవడం, దానిని రాష్ట్రపతికి పంపించడం, ఆతర్వాత అధికారిక తెలంగాణ ఆవిర్భావం.ఇవన్నీ చకచకా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు కాంగ్రెస్ పూర్తిచేసింది.

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలంగాణ బిల్లుపై ప్రత్యేక నోట్ కూడా సిద్దం చేసిందని సమాచారం. నిజానికి కోర్ కమిటీ, యూపిఏ, సిడబ్ల్యూసి సమావేశాలన్ని లాంచనం కోసమే చేసారని, సోనియా తెలంగాణ డిక్లేర్ చేసిందని, ఆమేరకే ఎప్పటినుంచో దీనిని అమలు చేయాల్సిన హోంమంత్రిత్వ శాఖ ఆపనిలో నిమగ్నమయిందన్న వార్థలు వినిపిస్థున్నాయి. కారణం కోర్ కమిటీకి ముందే షిండే ఓసారి అంతా రెడి చేసాం, నిర్ణయం వెలుబడడమే ఆలస్యం అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఒకసారి నిర్ణయం జరిగి,చట్ట సభల అంగీకారం జరిగిపోతే సీమాంధ్రలో ఆందోళనలు తగ్గుతాయని, కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకే ఆ దిశగా చకచకా అడుగులు వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: