అందరికీ సుద్దులు చెప్పే ఆంధ్రజ్యోతి గ్రూపు,  మానేజిగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఉరఫ్ "ఆర్కె" సుద్ధులు చెప్పటానికే ఆయన తన సంస్థను స్థాపించారు. "ఆమోదా బ్రాడ్కాస్టింగ్ నెట్-వర్క్" (ఏబిఎన్) బాస్ ఆయన.  వారాంతం ఆయన ఏబిఎన్ చానల్ వీకెండ్ కామెంటరీ పేరుతో చెప్పే నీతులు సుద్దులు ఆ ధమ్మున్న చానల్ కి  హద్దు లుండవు. 

నేపధ్యంలో ఉండి తనను నడిపించే వారికి  లబ్ధి చేకూర్చే మేరకు ఆ వ్యాఖ్యాత నోటికి అదుప హద్దు ఉండదు. వ్యాఖ్యానాలను నిజమని నమ్మి "ఏబిఎన్ చానల్ నిజాయతీ" ని నమ్మితే ఆ నీతులు వినేవారికి గాని తమ చానల్ వారికి మాత్రం కాదని అర్ధమౌతుంది. మరి "శకునాలు చెప్పే బల్లి కుడితి లో బడ్డట్టు"  సుద్దులు చెప్పే రాధాకృష్ణే ఇప్పుడు న్యాయస్థానంతో సుద్ధులు చెప్పించుకునే దశకు చేరారు.  ఆయన తనదాకా వచ్చే సరికి మాత్రం వేరే లా వ్యవహరిస్తున్నారు ఎందుకంటే ఆయనే అంత నిజాయతీపరుడు కాదని, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి సేవచేయటానికే ఆయన జీవిస్తున్నారని మిగతా మీడియానే కాదు ప్రజలందరూ భావిస్తారు.

ఏపిలో ప్రతిపక్షపార్టీ అధినేత వై ఎస్ జగన్ మోహనరెడ్డి పై తన పత్రికలో రాసిన, తన చానల్ లో ప్రసారం చేసిన వార్తా పరంపరపై, ఆ కథనాలపై, ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే వైసిపి ఎమెలే  "ఈ కథానాల వల్ల తమకు పరువు ప్రతిష్టలకు నష్టం వాటిల్లిందని" న్యాయస్థానం తలుపు తట్టారు.  

ఈ కేసు విచారణకు నాంపల్లి న్యాయస్థానం సమన్లు పంపినా వేమూరి రాధాకృష్ణ ఆయన బృందం తప్పించుకు తిరుగుతున్నారు. బాధ్యతగల మీడియా అధినేతగా తమ మీడియా వర్గంలో ప్రచురితం అయిన కథనాల విషయంలో కోర్టు కు వెళ్లి  వివరణ ఇచ్చుకోవాల్సిన సందర్భంలో న్యాయస్థానానికి హాజరు కాకుండా ఈ వ్యవహారాన్ని “నాన్ బెయిలబుల్ వారెంట్” (ఎంబిడబ్ల్యూ) విదుదలయ్యే వరకూ తెచ్చుకున్నారు. అంటే ఆయన ప్రచురించిన కథనాలు అబద్ధాలుగా భావించవలసి వస్తుంది. 

నాంపల్లి కోర్టు మంగళవారం ఆయనకు వ్యతిరేకంగా నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేసింది. వేమూరి రాధాకృష్ణ మంగళవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా ఆయన న్యాయస్థానానికి హాజరు కాకపోవడంతో నాంపల్లి కోర్టు సీరియస్‌ గా స్పందించింది. ఇప్పటికే వేమూరి రాధాకృష్ణ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం తోసి పుచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: