తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వారసత్వ రాజకీయాలు జరుగుతున్నాయని ఎప్పటి నుండో అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. కేసీఆర్ తర్వాత వారసుడిగా కేటీఆర్ అనే ప్రచారం కూడా ఉంది. దీనికి తగ్గట్టుగానే హైదరాబాదులో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లోనూ…. రీసెంట్ గా గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాల్లోనూ, మెట్రో ప్రారంభ కార్యక్రమంలో కేటీఆర్ పై బాగా ఫోకస్ చేశారు.

ఈ పరిణామాలను బట్టి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అత్యంత కీలకమైన నాయకుడిగా ఎదుగుతున్నడని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కెసిఆర్ కుమార్తె ఎంపీ కవిత కూడా రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించాలని ఉన్నటు తెలుస్తూంది.దానికి తగ్గటు ఆమె ఆలోచనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలలో పార్లమెంటు కు వెళ్ళే అవకాశాలు తక్కువ అని.

ఈ క్రమంలో కవిత జగిత్యాల నియోజకవర్గం పై దృష్టి పెటింది. దానికి అనుగుణంగానే తెరాస పార్టీ ఆమెకు బాధ్యతలను అప్పగించింది. ఈ క్రమంలో పార్టీ ఆఫీసు సంబంధించి సమావేశాలు  సమీక్షించడానికి జగిత్యల్లలో ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. ఇక్కడ నుండే కవిత అన్ని పనులను చక్కబెడుతుంది. కాబట్టి ఇదంతా భవిష్యత్ రాజకీయం కోసమే అంటూ బయట రాజకీయ నాయకులు  చెబుతున్నారు.

ఎంపీగా గడిచిన మూడున్నరేళ్లుగా ఎటువంటి ప్రాధాన్యత దక్కలేదు. సో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో కీలకం కావాలని వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనీ నిర్ణయానికి ఆమె వచ్చారు, కాబట్టి ఆమె యీ స్టెప్ తీసుకున్నట్లు సమాచారం. పార్టీలో మ‌రో శ‌క్తి కేంద్రంగా ఆమె ఎదిగే అవ‌కాశం ఉంటుంద‌నే చెప్పొచ్చు. మరి, మున్ముందు ప‌రిణామాలు ఎలా మార‌తాయో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: