"ఒక చర్యకు అదేస్థాయిలో తీవ్రమైన వ్యతిరేఖ దిశలో ప్రతిచర్య" ఉండటం అనేది భౌతికశాస్త్రం లో ఐజాక్ న్యూటన్ మహా శయుడు తన మూడవ సూత్రంగా చెప్పాడు. అయితే ఇదే సరిగ్గా ఇద్దరు రాజకీయవేత్తలు సమర్ధులైతే వారి మద్య ఇదే సూత్రం వర్తిస్తుంది. దీనికి ఋజువు టిడిపి నాయకుని శాసనసభలో చూపిన ఉగ్ర చర్యకు ప్రతి చర్యగా సున్నితంగా బిజెపి నాయకుడు నితిన్ గడ్కరి రియాక్షణ్ ద్వారా తెలుస్తుంది.  

polavaram project chandra babu angry in assembly కోసం చిత్ర ఫలితం

పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌, దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిది. కానీ, జాతీయ హోదా పొందక ముందు పోలవరం రాష్ట్ర ప్రాజెక్ట్‌ కావడంతో, జాతీయ హోదా దక్కిన తర్వాత కేంద్రం ఇచ్చే నిధులతో, రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్‌ పనుల్ని కొన సాగించాల్సిన పరిస్థితి వచ్చింది.

polavaram project chandra babu angry in assembly కోసం చిత్ర ఫలితం
"ఈ పోలవరం ప్రోజెక్ట్ మేమే చేస్తాం, కేంద్ర ప్రభుత్వం ప్రోజెక్ట్ కాబట్టి మీరు నిధులివ్వండి" అని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంతో, కేంద్రం సరే, దేశంలోనే అత్యంత తెలివైన, అనుభవమూ సమర్ధత ఉన్న ముఖ్యమంత్రి, కాబట్టి పని చేయించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికిచ్చి తప్పుకుంది. రాష్ట్రం పోలవరం పని పూర్తి చేసే బాధ్యత నెత్తిన పెట్టుకున్నప్పుడు చంద్రబాబు అన్న మాటలే: 


"పోలవరం ప్రాజెక్ట్‌ బాధ్యత నాదే, నా హయాం లోనే పోలవరం ప్రాజెక్ట్‌ని పూర్తి చేస్తాం, రికార్డు సమయంలో పోలవరం ప్రాజెక్ట్‌ని పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తాం. 2018 నాటికి గ్రావిటీతో నీళ్ళు, 2019 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తవడం ఖాయం"  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2014 ఎన్నికల తర్వాత చాలా చాలా సందర్భాల్లో చెప్పిన మాటల అర్ధమిది. 

polavaram project chandra babu angry in assembly కోసం చిత్ర ఫలితం

తరవాత కాలంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా గురువారం (30.11.2019) కేంద్రప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో కేంద్రం అడ్డంకులు సృష్టి స్తోందని ఆ నేపథ్యంలో ఆగ్రహోదగృలై, దాదాపు వీరభద్రుడే అయ్యారు. పోలవరం ప్రోజెక్ట్:

polavaram project chandra babu angry in assembly కోసం చిత్ర ఫలితం


"మీరే పూర్తి చేస్తారా? అలాఇతే ఇప్పటి కిప్పుడు ప్రాజెక్ట్‌ ని మీకే అప్పగించేయడానికి సిద్ధం. ఇప్పుడు ప్రాజెక్ట్‌ ఆగిపోతే ఇక కట్టలేం. చాలావిషయాల్లో సంయమనంటించాం . అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు" అంటూ చంద్రబాబు ఆవేశ కావేశాలు ప్రకటిస్తుంటే, "ఏమిటీ! ఇదంతా నిజమేనా? " ఆంధ్రప్రదేశ్ లో చాలామందికి రాష్ట్రం వెలుపలకొందరికి అనుమానం కలిగింది. "కుక్క పని కుక్కే చేయాలి. గాడిద చేస్తే బరువు మోయటం తప్పదు ఆపై నడుములు ఇరగ్గొట్టుకోవటం తప్పదు" 

polavaram project chandra babu angry in assembly కోసం చిత్ర ఫలితం

ఇప్పుడు దృశ్యం  మారింది  "మీరే పూర్తి చేస్తామంటే, ప్రాజెక్ట్‌ మీకే ఇచ్చేస్తాం"  అంటూ చంద్రబాబు, అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలతో కేంద్రం ఉలిక్కి పడింది అంతే కాదు జాగ్రత్త పడింది కూడా. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు కేంద్రం సిద్ధమయినట్లుగా కన్పిస్తోంది.  "ప్రాజెక్ట్‌ నిర్మాణం అనుకున్న సమయానికి ఎలా పూర్తి చేయించాలో నాకు తెలుసు"  అన్న వ్యాఖ్యలు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ నుంచి వచ్చాయంటే, చంద్రబాబు ప్రభుత్వం పై ఏ స్థాయిలో కేంద్రం షాక్‌ ఇవ్వబోతోందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీకాదు. 

సంబంధిత చిత్రం

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, 2014 ఎన్నికల తర్వాత పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులలో వేగం పెరిగింది. కేంద్రం మీద నమ్మకంతో, రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధుల్నీ ఎక్కువ గానే ఖర్చు చేసింది. కానీ, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావా ల్సిన స్థాయిలో రాలేదన్నదీ నిర్వివాదాంశం. మరిప్పుడు ఏమవుతుంది? పోలవరం ప్రాజెక్ట్‌ క్రెడిట్‌ని తన ఖాతాలో వేసుకోవా లనుకున్న చంద్రబాబు చేతుల్లోంచి, కేంద్రం ఆ ప్రాజెక్ట్‌ని లాగేసుకుంటే, చంద్రబాబు పరిస్థితి ఏమిటి?  అనేది భవిష్యత్ లో సమాదానం రాగల ప్రశ్న.


nitin gadkari polavaram project కోసం చిత్ర ఫలితం

ప్రస్తుతానికి  మాత్రం "చంద్రబాబు ఇమేజ్‌ పూర్తిగా డ్యామేజ్" అయిపోయింది. చంద్ర బాబు అసమర్థతని కేంద్రం ఎత్తిచూపు తోంది. తప్పదుమరి, అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఆవేశపడినందుకే ఈ ఝలక్‌.  నరెంద్ర మోదీ  అసలే ముదురు చర్యకు వ్యతిరేఖ ప్రతి చర్య ఎలా ఉంటుందో బాబుకు ఇకనైనా అర్ధమౌతుండవచ్చు.

nitin gadkari polavaram project కోసం చిత్ర ఫలితం

అటు ఉన్నది పోయింది ఉంచుకున్నదీ పోయిందన్నట్లు పోలవరం పని కాకపోగా పోలవరమే చేజారింది. రాష్ట్రప్రభుత్వం లెక్కలు చెపితే మోడీ వినడు సెంటీమీటర్ల ప్రకారం మార్కెట్ రేట్ లెక్క కట్టి ఇస్తాడు కాని కమీషన్లు, మించిన అంచానాలతో ఇచ్చిన కాంట్రాక్టర్ల లెక్కలు వేరే ఉంటాయికదా! అదీ ప్రధాన సమస్య. పోలవరం పని కేంద్రం తలచుకుంటే ఎంత?  

nitin gadkari polavaram project కోసం చిత్ర ఫలితం

గడ్కరీ మాటలతో పోలవరంపై మరో చిక్కుముడి పడినట్లయింది. పోలవరం ప్రాజెక్టుకు పెరిగిన అంచనాలను తాము ఇవ్వలే మని గడ్కరీ తేల్చి చెప్పడమే ఇందుకు కారణం. అంతేగాక, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ బాధ్యత కూడా తమది కాదని గడ్కరీ స్పష్టం చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వం మరోసారి ఇబ్బందుల్లో పడినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: