ఇరవై రెండేళ్ళ నిరవధిక పాలన తరవాత సహజంగా ప్రజల్లో వచ్చే "యాంటీ-ఇంకంబెన్సి" అంటే ప్రజల్లో 'పాలనానిర్వహణ పట్ల ఒకరకమైన విసుగు సహజ వ్యతిరెఖత భారతీయ జనతా పార్తీ పై తారస్థాయికి చేరింది. గెలుపుకి అదొక ప్రధాన ఆటంకం. గుజరాత్‌ ఎన్నికల తొలిదశలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు తప్పదని రాజకీయ పరిస్థితులు చెబుతున్నాయి. ఇప్పటికే రెండు పార్టీలు తమ రాజకీయ వ్యూహాలను పకడ్బందీగా అమలుచేస్తున్నాయి. అయితే గుజరాత్‌లో కాంగ్రెస్‌ రోజు రోజుకూ పుంజు కుంటోంది. 


rahul goes to temples in gujarat కోసం చిత్ర ఫలితం


ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన వ్యూహాన్నే గుజరాత్‌ లో విజయం సాధించటానికి కాంగ్రెస్‌ అమల్లో పెట్టింది. "సోషల్‌ ఇంజనీరింగ్‌ ఫార్ములా" నే ఫాలో అవుతోంది. అయితే నాలుగు నెలల్లో కాంగ్రెస్‌ జోరు పెరిగేందుకు నాలుగు ముఖ్య కారణాలున్నాయి: 

bjp congress in gujarat election war కోసం చిత్ర ఫలితం


మొదటిది, పార్టీపై ఉన్న హిందుత్వ వ్యతిరేక ముద్ర. దీన్ని తొలగించుకునేందుకు రాహుల్‌ గాంధీ దేవాలయాల సందర్శనకు ప్రాధాన్యమిస్తున్నారు.
రెండోది, ఎన్నికల ప్రచారంలో బయటివారితో కాకుండా స్థానిక నేతలతోనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. 
మూడోది, సాంప్రదాయ పద్ధతిలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. 
నాలుగోది, రాహుల్, హార్దిక్‌ పటేల్‌ల విమర్శలకు ప్రధాని మోదీ నేరుగా స్పందించేలా చేయటం. ఇది బీజేపీని కాస్త ఇబ్బందిపెట్టే అంశమే.

bjp congress in gujarat election war కోసం చిత్ర ఫలితం


పై విదానాలు కాంగ్రెస్ అనుసరించటంతో రాజకీయప్రయోజనల కోసం బాజపా గుజరాత్ తెరపైకి వ్యూహంమార్చి "హిందుత్వ" ను తీసుకురానుంది.


గుజరాత్‌ ఎన్నికల్లో మోదీ, అమిత్‌ షాల జోడీకి విజయం నల్లేరుమీద నడకే అనే పరిస్థితులు తొలి రోజుల్లో కనిపించాయి. కానీ ప్రచారం ముగింపునకు వస్తున్నకొద్దీ కాంగ్రెస్‌ జోరు పెరుగుతూ నువ్వా? నేనా? అనేస్థాయికి పుంజుకుంటున్నట్లు స్పష్టమైంది. గుజరాత్‌లో గెలవటం అంటే స్వక్షేత్రంలో అటు నరెంద్ర మోదీకి, ఇటు అమిత్‌ షాలకు అత్యంత ప్రతిష్టాత్మకం. 

bjp congress in gujarat election war కోసం చిత్ర ఫలితం

అందుకే వాళ్ళ జన్మస్థానంలో వారిని ఓడించటానికి కాంగ్రెస్‌ తన చరురంగ బలాలను మొహరించి జోరు పెంచిన నేపథ్యంలో దేశానికి "గుజరాత్‌ మోడల్‌" ను పరిచయం చేసిన నరెంద్ర మోదీ ప్రచారవ్యూహాన్ని మార్చారు. అభివృద్ధి అంశాన్ని పక్కన పెట్టి "హిందుత్వ" అస్త్రాన్ని తన అమ్ములపొది నుండి బయటకు తీసి ప్రయోగిస్తున్నారు. 

bjp congress in gujarat election war కోసం చిత్ర ఫలితం

"సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌" నినాదం తో 2012 ఎన్నికల్లో బీజేపీని విజయ తీరాలకు నడిపిన అభివృద్ది మంత్రం అప్పుడు పదును కోల్పోవటంతఒ 2014 సార్వత్రిక ఎన్నికల్లో "గుజరాత్‌ మోడల్‌" ను చూపించే మోదీ ఢిల్లీ గద్దెనెక్కారు.  అయితే, ఇప్పుడు ప్రధాన మంత్రి హోదాలో సొంత రాష్ట్రంలో "అభివృద్ధి" కి బదులు జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు, అయోధ్య తది తర అంశాలను ప్రచారంలో కొత్తగా వ్యూహం మార్చి లేవనెత్తుతున్నారు.

rahul goes to temples in gujarat కోసం చిత్ర ఫలితం

రాహులు గాంధి ఎన్నడూ లేని విధంగా గుళ్ళు, గోపురాల చుట్టూ ప్ఫ్రదర్శన చేస్తుండటం తో "హిందుత్వకు భారతీయ జనతా పార్టీ వంటి అసలు సిసలైన ప్రతినిధి ఉండ గా,  మరో దాంతో పనేమిటి" అని ఇటీవలే అరుణ్ జైట్లీ కూడా వ్యాఖ్యానించారు.  అయితే "హిందుత్వ చాంపియన్‌-బీజేపీ" యే అయినప్పటికీ కూడా నిరుద్యోగ సమస్య, రిజర్వేషన్లపై పటీదార్ల ఆందోళనలు ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనున్నాయనేది వాస్తవం. 

bjp congress in gujarat election war కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: