చంద్రబాబుకు హరికృష్ణ టాటా చెప్పేసినట్లేనా? కొద్ది రోజుల క్రితం విశాఖ పాదయాత్ర ముగింపు సభకు చివరినిముషంలో హాజరై తాను చంద్రబాబు వెంటే ఉన్నానన్న విషయం తెలియచెప్పే ప్రయత్నం చేసారు. అప్పుడు కూడా తన అసంతృప్తిని, అసహనాన్ని వేదికపైనే వెళ్లగక్కారు కూడా. తరువాత మళ్లీ ఏనాడూ దేశం కార్యాలయం, కార్యక్రమాల చుట్టుపక్కల కనిపించలేదు. శుక్రవారం టిడిపి నిర్వహించిన పార్లమెంటరీ బోర్డు సమావేశానికి కూడా హరికృష్ణ తప్ప అందరు ఎంపీలు హాజరయ్యారు.

దీంతో చంద్రబాబుకు హరిక్రిష్ణ టాటా చెప్పినట్టేనా అన్న అనుమానం వస్తోంది. వైకాపా ఫ్లెక్సీలపై జూనియర్ ఎన్టీఆర్
బొమ్మలు దర్శనమిచ్చిన  నేపథ్యంలో చంద్రబాబుకుహరికృష్ణకు నడుమ విబేధాలు ముదిరాయి. ఆతరువాత బాలకృష్ణ వాఖ్యలు కూడా వీటికి ఆజ్యం పోసాయి. . ఈ నేపథ్యంలో హరికృష్ణకూడా చంద్రబాబుబాలకృష్ణ ల తీరుపై బాహాటంగానే విమర్శలు కురిపించారు.

జూనియర్ ను మహానాడు కు పిలవకపోవడంతో ఇక చంద్రబాబు కూడా హరికృష్ణ
జూనియర్ ఎన్టీఆర్ ను దూరం చేసాడన్న వార్థలు వినబడ్డాయి.లోకేష్ కోసం హరికృష్ణను, జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు పక్కన బెట్టాడని కూడా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు తీరు కూడా ఉండడం
ఇప్పుడు తెలంగాణ బిల్లుపై పార్లమెంట్ లో ఎలా వ్యవహరించాలి అన్న దానిపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి హరికృష్ణ హాజరు కాకపోవడంతో ఈ వార్థలు నిజమేనంటున్నారు అందరు.

మరింత సమాచారం తెలుసుకోండి: