పవన్ కళ్యాణ్ ఈ పేరు తెలుగు రాష్టాలలో సుపరిచితం. 2014లో జనసేన పార్టీని పెట్టి ఎన్నికలలో పోటిచేయకుండా టిడిపి, బిజెపి కూటమి కి మద్దతు ఇచ్చాడు . ఆ తరువాత టిడిపి బిజెపి కూటమి అదికారము లోకి రావడం అన్ని జరిగిపోయాయి . కాని ఇప్పుడు పరిస్తితిని చూస్తుంటే టిడిపి బిజెపి కూటమికి పవన్ మద్దతు ఇచ్చేటట్లు కనిపించడం లేదు . తన మాటలను బట్టి చూస్తుంటే 175 నియోజకవర్గాలలో ఒంటరిగ బరిలో దిగే టట్లు కనిపిస్తున్నాడు .

ఇక్కడ ఉత్పన్నమవుతున్న ప్రస్న , పవన్ వంటిరిగా బరిలో దిగితే ఎ పార్టీ కి ఎంత నష్టం చేకూరుతుంది. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో సినిమా వాళ్ళు ను నమ్మే పరిస్తితిలో జనాలు లేరు . కాని పవన్ విషయంలో ఎంత కొంత నమ్మకము పెట్టుకున్నారు . ఎందుకంటే అతని నిజాయతి మీద నమ్మకం. నిజానికి పవన్ పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు కాని పూర్తి స్థాయి రాజకియలు చేయటం లేదు . ఆతను ఎక్కువగా ట్విట్టర్లో స్పందిస్తాడు అని , అప్పుడప్పుడు పార్ట్ టైం రాజకీయాలు చేస్తాడని ప్రతిపక్షం నుంచి వినిపిస్తున్న మాటలు . పైగా జనాలలో కూడా అదే ప్రస్నలు వినిపిస్తిన్నాయి . ఏ పార్టీ కైనా క్షేత్ర స్తాయిలో మంచి పట్టు, కార్య కర్తల బలం ఉంటేనే ఆ పార్టీ నెగ్గుకురాగలదు.
Image result for jagan lokesh
అది తెలుగు దేశం పార్టీ ని చూస్తూనే అర్ధం అవుతుంది . నిజం చెప్పాలంటే వైస్సార్సిపి కంటే టిడిపికి క్షేత్ర స్తాయిలో మంచి పట్టు ఉంది. నాయకుడు ఎంత గొప్పవాడు ఐన క్షేత్ర స్తాయిలో పార్టీ ని తీసుకేల్తేనే , ప్రజలు వోట్లు పొందగలరు . ఈ విషయంలో జనసేన కు పాస్ మార్క్స్ కూడా పడవు. పైగా అన్ని తానై నడిపిస్తున్నాడు. ఇది రాజకీయాలలో అంత మంచి ఫలితాన్ని ఇవ్వదు. ప్రజలలో నమ్మకం కలగాలంటే పూర్తి స్తాయి రాజకీయాలు చేస్తూ , పార్టీ ని బలోపేతం చేస్తేనే 2019 లో పవన్ ప్రబావం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పవచ్చు . కాని ఇప్పుడే అతని ప్రబావం ఎంత ఆని మాత్రం చెప్పలేము . ఎందుకంటే రాజకీయాలలో సమీకరణాలు శెరవేగంగా మారుతాయి. మరియు టిడిపికి అండగా నిలుస్తాన్నాడు అని, చంద్రబాబు మీద కొన్ని విషయాలలో ప్రజా వ్యతిరేకత ఉన్న , ఆ విషయంలో పవన్ కళ్యాణ్ చంద్ర బాబును విమర్శలు చేయకపోవడం ప్రజలలో అనేక అనుమానలుకు దారి తిస్తుంది. మొన్న విశాఖపట్టణంలో జరిగిన సభ లో అతను లోకేష్ ను మరియు జగన్ ను విమర్శించిన తీరులోనే అర్ధ మవుతుంది.

Related image

జగన్ విషయంలో ఘాటుగా స్పందించిన ఆతను , లోకేష్ విషయంలో అంతగా విమర్శంచని నేపద్యం లో అతని మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా చంద్ర బాబు మీద క్లియర్ స్టాండ్ తీసుకున్నట్లయితే , ఆతను ఎ పార్టీ తప్పు చేసిన నిలతీస్తున్నాడని ప్రజలకు నమ్మకం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: