తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత తెలంగాణలో జిల్లాల సంఖ్య పెరిగిన సంగతి తెలిసిందే.  10 జిల్లాలను ఏకంగా 31 జిల్లాలు చేశారు. తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై జనం కూడా సంతృప్తిగానే ఉన్నారు. ఇప్పుడు ఏపీలోనూ ఇదే పని చేయబోతున్నారా.. తెలంగాణ కంటే భూభాగంలో పెద్దదైన ఏపీ జిల్లాల విభజనకు పూనుకుంటుందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ మేరకు ఇప్పటికే వైఎస్ జగన్ కొత్త జిల్లాల ప్రణాళిక ప్రకటించేశాడు.

Image result for telangana new districts

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల సంఖ్య పెంపు ఊహాగానాలు విభజన దగ్గర నుంచి ఉన్నవే. విభజనతో చిన్నది అయిపోయిన రాష్ట్రంలో జిల్లా సంఖ్యను పెంచనున్నారని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఆ కార్యక్రమం త్వరలోనే చేపట్టబోతోందట ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  ఏపీలో కూడా వచ్చే ఏడాది ఆరంభంలో ఈ పని జరగబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

Image result for kcr

అయితే ఇందుకు సంబంధించి అధికారిక ధ్రువీకరణ ఏదీ లేదు. జరుగుతున్న ప్రచారం ప్రకారం.. కొత్త జిల్లాల విభజన ఇలా ఉండబోతోంది...మొత్తం 24 జిల్లాలు కాబోతున్నాయని అంచనా... ఈ మేరకు ఇప్పటికే వైఎస్ జగన్ కొత్త జిల్లాల ప్రణాళిక ప్రకటించేశాడు. తాము అధికారంలోకి వస్తే ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ప్రకటిస్తామన్నారు.

Image result for chandrababu

మరో అడుగు ముందుకు వేసి ఆయా జిల్లాలకు ఇన్ ఛార్జ్ లను కూడా వైసీపీ ప్రకటించేసింది. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే ఆలోచనలో ఉన్నారట. పరిపాలన సౌలభ్యం కోసం ఏపీలో జిల్లాల సంఖ్య పెంచే ఆలోచన చేస్తున్నారట. సంక్రాంతి నాటికి ఈ కొత్త జిల్లాలు కొలిక్కి రావచ్చని ఓ అంచనా. మరి ఆ జిల్లాలు ఏవో తెలుసుకుందామా..

1)అనంతపురం - అనంతపురం, హిందూపురం

2)చిత్తూరు- చిత్తూరు, తిరుపతి

3)కడప- కడప, పులివెందుల

4)కర్నూలు- కర్నూలు, నంద్యాల

5)ప్రకాశం-ప్రకాశం(ఒంగోలు), కందుకూరు

6)నెల్లూరు-నెల్లూరు

7)గుంటూరు-గుంటూరు, పొన్నూరు

8)కృష్ణా-కృష్ణా(విజయవాడ), మచిలీపట్నం

9)పశ్చిమగోదావరి-పశ్చిమగోదావరి, ఏలూరు

10)తూర్పు గోదావరి-కాకినాడ, అమలాపురం

11)విజయనగరం-విజయనగరం, పార్వతీపురం

12)శ్రీకాకుళం-శ్రీకాకుళం, పాలకొండ

మరింత సమాచారం తెలుసుకోండి: