ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాన్  ఈ మధ్య సుడిగాలి పర్యటన చేసిన సంగతి తెలిసిందే . అయితే ఈ పర్యటనలో అతని అభిమానులు బ్రహ్మారధం పట్టారు . అడుగడుగన జనసేన అధినేత కు ఘన స్వాగతం పలికారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ పర్యటనలో జనసేన అభిమానులు సిఎం పవన్ , సిఎం పవన్ అని నినాదాలు చేశారు. ఈ నినాదాలు విన్న తరువాత అందరికి అస్సలు పవన్ 2019 లో పవన్ సిఎం అవుతాడా అనిపించింది.  సమకాలిన రాజకీయాల పట్ల అవగాహన  ఉన్నవారు చెప్పే సమాధానం ఏంటో తెలుసా..పవన్ సిఎం అయ్యే ఛాన్సే లేదని .

Image result for pawan kalyan

కాని 2019 లో అతని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది అని, ఎందుకంటే అతని తరుపున బలమైన సామాజిక వర్గం నిలబడుతుందని కొంత మంది నమ్మకం. పవన్ సిఎం అయ్యే ఛాన్స్ లేకపోవడానికి కారణాలు లేకపోలేదు. సిఎం అయ్యే స్థాయి ఒక పార్టీ అధినేతకు ఉండాలంటే,  ఆ పార్టీ నిర్మాణ దశ నుంచి క్షేత్ర స్థాయిలో ప్రజల్లో బలంగా పాతుకుపోవాలి. అటువంటి నిర్మాణం ఆంధ్రప్రదేశ్ లో రెండే, రెండు పార్టీలకు ఉన్నాయి.

Image result for pawan kalyan

ఒకటి టిడిపికి రెండు వైసిపికి జనసేన పార్టీ విషయంలో అస్సలు ఆ పార్టీ నిర్మాణమే పూర్తి కాలేదు. ఆలు లేదు పోలు లేదు అన్నట్టు ఉంది ఆ పార్టీ పరిస్థితి. అయితే అభిమానుల నినాదాలు ఉత్సాహంతోను,లేదా పవన్ మీద అభిమానం తో వచ్చి ఉంటాయి. నిజానికి ఆ విషయం పవన్ కల్యాణే ఒప్పుకున్నాడు. ఈ సారి నేను గెలవలేను అని, సిఎం అయ్యే స్థాయి తనకు ఇంకా రాలేదని తనే ఒప్పుకున్నాడు. ఆ మధ్య జరిగిన సర్వేలో కుడా జనసేన పార్టీ కి 1 నుంచి 2% వరకు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

Image result for pawan kalyan polavaram

తెలుగుదేశం వారు కుడా పవన్ ఒకరిని గెలిపించగలరని, తనకు స్వంతగా గెలిచే సత్తా లేదని, ప్రస్తుతానికి తమ ప్రత్యర్ధి వైయస్సార్సిపి అని దానికి తగ్గట్టు వ్యూహాలు రచిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఒక టిడిపి మంత్రి అయితే జనసేననా? ఆ పార్టీ ఎక్కడ ఉంది ఏమో నాకు అయితే తెలియదు అన్నాడు. అంటే దానర్ధం పార్టీనిర్మాణమే లేదు అని, దానిని పార్టీగా ఎలా గుర్తిస్తామని తన ఉద్దేశం.
Image result for pawan kalyan polavaram
కాని జనసేనకార్యకర్తల వెర్షన్ వేరేల ఉంది. పవన్ కు యువత లో మంచి క్రేజ్ ఉంది అందుకే అతనే తరువాత మా సిఎం అనేస్తునారు. అస్సలు తల తోక లేని పార్టీ అని ప్రతిపక్షం విమర్శిస్తుంటే జనసేన కార్యకర్తలు మాత్రం పవనే తరువాత సిఎం అని పగటి కలలు కంటున్నారు. ఎవరి మీద వారికి నమ్మకం ఉండొచ్చు కాని మరి ఓవర్ నమ్మకం ఉండకూడదని పవన్ అభిమానులును చూస్తుంటే అర్ధం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: