దేశంలోనే పేరు మోసిన సియారాం సిల్క్ టెక్స్ టైల్స్ డైరెక్టర్ అభిషేక్ పొద్దార్ బార్య విహారి తన వేసుకున్న లోదుస్థుల్లో లోఫర్ పనిచేస్థూ అడ్డంగా దొరికిపోయింది. ముంబయ్ ఎయిర్ పోర్టు అధికారులు ఆమెను పట్టుకున్నారు. సింగపూర్ లోని విహారి జువెల్లర్స్ కు ఈమె మేనేజింగ్ డైరెక్టర్ కూడా.

సింగపూర్ నుంచి రూ.2.35కోట్ల రూపాయలు విలువచేసే వజ్రాభరణాలను ఇండియాకు స్మగ్లింగ్ చేస్థోంది. ఈసమాచారం డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ కు ఎవరో సమాచారం అందించారు. దీంతో ఆమె రాకకోసం ముంబయిలోని చత్రపతి శివాజి అంతర్జాతీయ విమానాశ్రయంలో మాటువేసారు. విమానం దిగిన విహారి ఎవరికి చిక్కకుండా గ్రీన్ చానల్ మీదుగా వచ్చే ప్రయత్నం చేసింది.

అప్రమత్తమైన అధికారులు ఆమెను పట్టుకుని ఆమె ధరించిన లోదుస్థుల్లో సింగపూర్ నుంచి స్మగ్లింగ్ చేస్థున్న వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాదు ఆమె కు సంబందించిన దుకాణాల్లో సోదాలు చేపట్టారు. ఈసోదాల్లో 4కోట్ల విలువైన ఆభరణాలు దొరికాయి, వీటిని కూడా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: