రాహుల్ గాంధి నెహౄ కుటుంబం నుండి కాంగ్రెస్ అధ్యక్షుడైన ఆరవ తరం వారసుడు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ను తమ చెప్పు చేతల్లో ఉంచుకొని దేశాన్ని ఎలేసిన ఈ కుటుంబం తొలి వ్యక్తి మోతీలాల్ నెహౄ, ఆ తరవాత వరసగా జవహర్లాల్ నెహౄ, ఇందిరా గాంధి, రాహుల్ గాంధి సోనియా గాంధి కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు ఆ తరవాత రెండు మూడు రోజుల్లోనే కాంగ్రెస్ హిమాచల ప్రదేశ్ రాష్ట్రాన్ని చేయి జార్చుకుంది. ఇప్పుడు హస్తం పార్టీ చేతిలో ఒక నాలుగు రాష్ట్రాలే మిగిలున్నాయి.

పై మాప్ లో తాజాగా హిమాచల్ను కాంగ్రెస్ కోల్పోయింది. ఇక కాంగ్రెస్ కు మిగిలింది నాలుగు రాష్ట్రాలు (కర్ణాటక, పంజాబ్, నాగాలాండ్ మిజోరం) ఒక కెంద్ర పాలిత ప్రాంతం (పుదుచ్చేరి) మాత్రమే.

కాంగ్రెస్ ముక్త భారత్ చేస్తానన్న ప్రధాని నరేంద్ర మోదీ బాజపా అధ్యక్షుడు అమిత్ షా ఇచ్చిన పిలుపు, ఆ తరవాత జరిగే పరిస్థితి చూస్తేంటే వారిరువురూ వారి స్వప్నాన్ని నిజం చేసుకునేలా ఉంది. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి కేవలం ఏడు రాష్ట్రాల్లోనే భాజపా అధికారంలో ఉంది ఆ తరవాత నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళం దూకుడు తోనే విజయం సాధిస్తుండటంతో భాజపా దాని మిత్రపక్షాల పాలిత రాష్ట్రాల సంఖ్య 19కి చేరింది.


డిల్లీ, పంజాబ్‌, కర్ణాటక మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ కమలం వికసించింది. కాంగ్రెస్‌ ఒక్కో రాష్ట్రాన్ని చేజార్చుకుంటూ ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది కాంగ్రెస్. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్ఛేరిలో కూడా కాంగ్రెస్సే అధికారంలో ఉంది.  జమ్ము కశ్మీర్‌, ఆంధ్ర ప్రదేశ్‌, బీహార్‌ లాంటి రాష్ట్రాల్లో భాజపా, దాని మిత్రపక్షాలతో కలిసి జతకట్టి అధి కారం పంచుకుంది.


Image result for congress mukta bharat

తమిళనాడులో అన్నా-ఏడీఎంకే, పశ్చిమ్‌ బంగాలో తృణమూల్‌ కాంగ్రెస్‌, డిల్లీలో ఆమ్‌ఆద్మీ లాంటి ప్రాంతీయ పార్టీలు అధి కారంలో ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ పంజాబ్‌, కర్ణాటక, మేఘాలయ, మిజోరంలో అధికారంలో ఉంది. వచ్చే ఏడాది కర్ణాటక, మేఘాలయ, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సీపీఎం సారథ్యంలోని వామపక్షకూటమి కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతోంది.కేవలం రాజకీయ ఎత్తుగడలే కాకుండా తన ఆర్థిక విధానాలద్వారా నరెంద్ర మోదీ భాజపాకు తిరుగులేని ఆధిక్యం సంపాదించి పెట్టారు. 

Image result for congress mukta bharat


పెద్దనోట్ల రద్దు తర్వాత భాజపాకు ఎదురుగాలి వీస్తుందని కొందరు రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ వారి అంచనాలను తారుమారు చేస్తూ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో భాజపా భారీ మెజార్టీ సాధించింది. జీఎస్‌టీ అమలు తర్వాత జరిగిన గుజరాత్‌, హిమా చల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల లోనూ సత్తా చాటింది. దీంతో ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాల సంఖ్య 19కి చేరింది. 2018లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎన్నింటిలో భాజపా పాగా వేస్తుందో వేచి చూడాలి. కమలదళం దూకుడు చూస్తే 2019 లోనూ ఫలితాలు ఇలాగే ఉండే అవకాశాలు లేకపోలేదు.

Image result for congress mukta bharat


గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వరుసగా ఆరోసారి విజయం అంటే డబుల్ హ్యాట్రిక్ సాధించడంతో తిరుగు లేని నేతగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిరూపించు కున్నారు. తనపై విమర్శల దాడి చేసేందుకు కాచుకు కూర్చున్న బాజాపా వైరిపక్షాలకే కాదు, అంతర్గత శత్రు నేతలకు కూడా ఈ గెలుపు ద్వారా గట్టి సమాధానమే  చెప్పారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు తర్వాత ప్రతిపక్ష పార్టీలతో పాటు తమ సొంత బాజపా లోని ఒకరిద్దరు నేతలు ముఖ్యంఫ్గా యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌శౌరీలు నరెంద్ర మోదీకి వ్యతిరేక స్వరం పెంచారు. అలాగే మంత్రిమండలి లో అప్రధాన శాఖలో కొన్సాగుతున్న ఉమాభారతి వంటి భాజపా సీనియర్‌ నేతలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై సమయం దొరికినప్పుడల్లా బాహాటంగా విమర్శలు గుప్పించారు. 

Image result for congress mukta bharat


పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు తర్వాత ఏన్డీఏ భాగస్వామ్యపక్షాల్లోని కొందరు మితృలు పునరాలోచనలో పడ్డారు. భాజపాతో స్నేహం వదులుకునేందుకు సిద్ధమైన ఆ మిట్రులు తాజాగా గుజరాత్ హిమాచల్ ఫలితాలతో ఎన్డీయేలోనే కొనసాగాల్సిన అవ సరం ఏర్పడింది. ముఖ్యంగా శివసేన లాంటి పార్టీలకు గుజరాత్‌ లో భాజపా గెలుపు, ఒక బలమైన హెచ్చరిక గానే భావించ వచ్చు. 


2019 ఎన్నికల్లో భాజపాతో పొత్తు కొనసాగించాలా వద్దా అని వూగిసలాడుతున్న కొన్ని పార్టీలు ఉదాహరణకు ఆంధ్ర ప్రదేశ్ లోని తెలుగు డేశం పార్టీ గుజరాత్‌ ఫలితాల తర్వాత తమ అభిప్రాయాన్ని మార్చు కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ లలో విజయం సాధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఆర్థిక విధానాలను ప్రజలు ఆమోదిస్తున్నారని ఒక సందేశం నమో ద్వారా నిరూపించుకోగలిగారు.   


కాంగ్రెస్ ముక్త భారత్ భీష్మ ప్రతిఙ్జే! దాని కోసం మన్మోహన్ సింగ్ నైనా తిట్టకుండా ఉండేలా లేరు నరెంద్ర మోదీ. 

Related image

మరింత సమాచారం తెలుసుకోండి: