తెలంగాణ పునర్ నిర్మాణంలో టిఆర్ఎస్ దే కీలకపాత్ర అని కేసిఆర్ స్పష్టం చేసారు. తెలంగాణ వచ్చేసినట్టేనని ఆయన చెప్పారు. అయితే బిల్లు పాసయ్యేంతవరకు దానిపై మాట్లాడనని తెలిపారు. తెలంగాణలో అన్ని రంగాలను అభివృద్ది చేస్థామని చెప్పారు. మావోయిస్టులతో చర్చలు జరపాలన్నదే నాఉద్దేశ్యం అన్నారు.

ప్రధానంగా విద్యుత్ సమస్యపై దృష్టిపెడతామన్నారు. తెలంగాణలో ఎన్టీపిసి ద్వారా 1200మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, ధర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా 2280మెగావాట్ల విద్యుత్ ఉత్తత్తి జరుగుతోందిని చెప్పారు. అయినా తెలంగాణకు విద్యుత్ సమస్య తప్పకపోవచ్చన్నారు. అయితే అపారంగా ఉన్న బొగ్గువనరులను ఉపయోగించుకుని ఆసమస్యను అధిగమిస్థామన్నారు.

నిజామాబాద్ జిలా బోధన్ షుగర్ ఫ్యాక్టరీని పునర్ నిర్మిస్థామన్నారు. జలవనరులను ఉపయోగించుకుని వ్యవసాయరంగాన్ని అభివృద్ది చేస్థామన్నారు. తాను ఇటీవల ఏర్పడ్డ జార్ఖండ్, చత్తీస్ ఘడ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఉద్యోగుల వ్వవహారం ఎలా జరిగిందో, అలాగే ఇక్కడా జరుగుతుందని చెప్పానన్నారు. ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు ఆంధ్ర రాష్ట్ర పాలనను చూసుకుంటే తెలంగాణ ప్రాంత ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలను చూస్థారని ఇందులో వేరే ఆప్షన్ లేదన్నానని ఇందులో తప్పేముందో తనకు తెలియడం లేదన్నారు. ఏది ఏమైనా, ఎవరేమనుకున్నా తాను పట్టించుకోనని తెలంగాణ ఎలా బయటపడాలి అన్నది మాత్రమే ఆలోచిస్థానని చెప్పారు కేసిఆర్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: