గత కొంత కాలంగా దేశం లోనే తయారిని వ్విస్తృత పరచటం, విదేశీ దిగుమతులను తగ్గించటానికి, భారతీయ తయారి రంగాని కి ఊతమిచ్చే ఉద్దేశంతో, కేంద్ర ప్రభుత్వం దిగుమతులపై సుంకం పెంచటంతో దేశీయంగా అమాంతం టెలివిజన్లు, మైక్రో వేవ్‌ ఓవెన్లు, ఎల్‌ఈడీ ల్యాంపులు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువుల ధరలు పెరిగాయి.

Image result for godrej appliances

 
కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులపై గత వారం కేంద్రం సుంకం పెంచడంతో వీటి కొనుగోలుకు అధికంగా ఖర్చు చేయా ల్సిన పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌ ప్రకారం టెలివిజన్లపై సుంకం 20 శాతానికి, స్మార్ట్‌ఫోన్ల పై సుంకం 15 శాతానికి పెరిగింది. ఎల్‌ఈడీ ల్యాంపులు, మైక్రోవేవ్‌ ఓవెన్లపైనా దిగుమతి సుంకం 20 శాతానికి చేరింది. ఎల్‌ఈడీ టీవీల ధరలు సగటున రూ.2,000 నుంచి రూ.10,000 వరకు వాటి సైజుల ఆధారంగా పెరగనున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

Image result for godrej appliances


ప్రభుత్వ తాజానిర్ణయం వల్ల స్థానికతయారీదారులు లాభపడతారని, దేశీయ తయారీని పెంచడమే కాకుండా "భారత్‌లోనే తయారీ" అంటే "మేకిన్ ఇండియా" కి డిమాండ్‌ ఏర్పడు తుందని అన్నారు. మైక్రోవేవ్‌ ఓవెన్లపై రూ.400-500 వరకు పెంపు ఉంటుందని 'గోద్రేజ్‌ అప్లియన్సెస్‌' బిజినెస్‌ హెడ్ హెచ్‌ కమల్‌ నంది తెలిపారు. ఈ దిగుమతి  డ్యూటీ పెంపు తర్వాతయాపిల్‌ ఐఫోన్ల ధరలను రూ.3,720 వరకు పెంచిన విషయం తెలిసిందే.

Image result for i phones

మరింత సమాచారం తెలుసుకోండి: