రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన తరువాత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటికంటే పెద్దదైన రూ. 2000 నోటును చలా మణిలోకి తెచ్చింది. తర్వాత రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ప్రవేశపెట్టిన కొత్త రూ.2000 నోట్ల ప్రింటింగ్‌ను ఆపివేస్తున్నారని లేదా వాటిని రద్దు చేస్తున్నారంటూ ఇలా రోజుకో వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా ఎస్‌బీఐ రీసెర్చ్‌ రిపోర్టు కూడా రూ.2000 నోట్లను రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా వెనక్కి తీసుకోబోతుందని లేదా పెద్ద డినామినేషన్‌ కరెన్సీ ప్రింటింగ్‌ను ఆపి వేస్తుందంటూ వెలువరించింది.



లోక్‌సభలో ఆర్‌బీఐ సమర్పించిన వార్షిక రిపోర్టు ఆధారంగా ఎస్‌బీఐ ఎకోఫ్లాష్‌ ఈ రిపోర్టును విడుదల చేసింది. ఈ రిపోర్టులో మార్చి 2017 వరకు చిన్న డినామినేషన్‌ కరెన్సీనోట్ల చలామణిని ఆర్‌బీఐ పెంచినట్టు తాము గుర్తించామని పేర్కొంది. తొలిసారి రూ.200 నోటును కూడా ఆర్‌బీఐ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఇవి రూ.3,501 బిలియన్లుగా ఉన్నట్టు కూడా తెలిపింది. 

Image result for soumya kanti ghosh sbi with currency notes


డిసెంబర్‌ 8 నాటికి చలామణిలో ఉన్న పెద్ద డినామినేషన్‌ నోట్ల విలువ రూ.13,324 బిలియన్లు ఉంటే, ప్రింట్‌ చేసినవి రూ.15,787 బిలియన్లుగా ఉన్నట్టు నివేదించింది. అంటే రూ.2,463 బిలియన్ల పెద్ద కరెన్సీ నోట్లను ఆర్‌బీఐ ప్రింట్‌ చేసినప్ప టికీ, మార్కెట్‌లోకి తీసుకురాలేదని ఎస్‌బీఐ గ్రూప్‌ చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వయిజర్‌ సౌమ్య కాంతి ఘోష్  తెలిపారు. ప్రస్తుతం చిన్న కరెన్సీ నోట్లు మొత్తం చలామణిలో 35 శాతం మాత్రమే. అంటే ఆర్‌బీఐ పెద్దనోట్లను మార్కెట్‌లోకి విడుదల చేయడాన్ని తగ్గించిందని, చిన్న నోట్ల సర్క్యూలేషన్‌ పైనే ఎక్కువగా దృష్టిసారించినట్టు రీసెర్చ్‌ రిపోర్టు వెల్లడించింది.
Image result for whether 2000 currency note printing stopped RBI Ecoflash report

రూ. 2000 నోట్లను రద్దు చేయనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నప్ప టికీ, అవి పుకార్లుగానే పరిగణించడం జరిగింది. కానీ తాజాగా ఎస్‌బిఐ ఈకోప్లాష్ రీసెచ్చ్ రిపోర్టు ప్రకారం ఆ వార్త నిజమేనని స్పష్టం అవుతోంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లను వెనక్కి తీసుకోవడంగానీ, నోట్ల ప్రింటింగ్‌ ను ఆపేయడం గానీ చేసే అవకాశం ఉందని ఎస్‌బిఐ రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. ఇటీవల లోక్‌సభలో ఆర్బీఐ సమర్పించిన వార్షిక నివేదిక ప్రకారం, అదేవిధంగా డిసెంబర్ 8వరకు చెలామణి అయిన పెద్దనోట్ల విలువ రూ. 13,324 బిలియన్లుగా ఉందని వెల్లడించింది.

Image result for rbi logo

 ఆ తరువాత కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్‌సభలో సమర్పించిన నివేదిక ప్రకారం, డిసెంబర్ 8వరకు ఆర్‌బిఐ 16,957 మిలియన్ సంఖ్య లో రూ. 500 నోట్లను, 3,654 మిలియన్ సంఖ్య లో రూ. 2000 నోట్లను ముద్రించింది. వీటి మొత్తం విలు 15,787 బిలియన్ల రూపాయిలు ఉంటుంది. దీన్ని పరిశీలించినట్లయితే, ప్రింటై అయిన నోట్ల విలువ రూ. 15,787 బిలియన్లు - చెలామణి అయిన నోట్ల విలువ రూ.13,324 బిలియన్లు రూ. 2,463 బిలియన్ల విలువైన రూ. 2000 నోట్లను చలామణిలోకి తీసుకు రాలేదు. 

Image result for rbi logo

మరింత సమాచారం తెలుసుకోండి: