ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నిందితుడిగా ఉన్న  దాణా కుంభకోణం కేసుకు సంబంధించి తుది తీర్పు వెలువడింది.   ఈ కేసులో  లాలూ ప్రసాద్‌ను దోషిగా తేల్చుతూ సీబీఐ స్పెషల్‌ కోర్టు శనివారం తీర్పునిచ్చింది. ఈ తీర్పు వెలువడే క్రమంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌, తన కొడుకు తేజస్వి యాదవ్‌తో కలిసి కోర్టుకు హాజరయ్యారు.  దీంతో  బిహార్‌ బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది.16 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణలో లాలూ ప్రసాద్ యాదవ్ దోషేనని సీబీఐ కోర్టు తేల్చింది.
Image result for lalu prasad yadav
ఈ కేసులో 1997లో సీఎం పదవిని లాలూ ప్రసాద్ యాదవ్ వదులుకున్నారు. మంగళవారం దాణా స్కామ్ కేసుకు సంబంధించిన శిక్షను రాంచీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఖరారు చేయనుంది. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏడేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 1990-97 మ‌ధ్య లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ బీహార్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో దాణా కొనుగోళ్ల‌లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.
Image result for lalu prasad yadav
అప్ప‌ట్లో బీహార్‌లో దాణా కోసం మొత్తం రూ.900 కోట్లు ఖర్చు చేశారు. 1991 నుంచి 1994 మధ్య ట్రెజరీ నుంచి పశుదాణా కోసం అక్ర‌మంగా రూ.89 లక్షలు విత్‌డ్రా చేశారు. ఈ కేసులోనే సుదీర్ఘంగా వాద‌న‌లు జ‌రిగాయి.  ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. రెండు దశాబ్దాల అనంతరం ఈ కేసుపై నేడు సీబీఐ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: