"జూనియర్‌ ఉద్యోగులకు జీతాలను పెంచకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోపక్క, సీనియర్ల జీతాలు  భారీగా పెరుగు తుండటం శ్రేయస్కరం కాదు. ఇలాంటి ధోరణులతో పెట్టుబడిదారీ వ్యవస్థపై సామాన్య ప్రజలకు నమ్మకం కలిగించలేం. దేశంలో కోట్లాదిమంది ప్రజలు పేదరికంలో ఉన్నారని మరవొద్దు" అని ఇంఫోసిస్ ముఖ్య వ్యవస్థాపకలు నారాయణ మూర్తి మరో సంధర్భంలో మరో సారి ప్రస్థావనలోకి తెచ్చారు.  ఆయన మాటల్లోని యధార్ధతను అభినందించవలసిందే. కాని ఎవరు తొలి అడుగువెయ్యాలి.
Image result for narayana murthy in iit mumbai

అనుభవఙ్జులైన ఉన్నతోద్యోగుల జీత భత్యాలకు ఆకాశమే హద్దుగా మారుతుంది. అవకాశాలు, ఆనందాలు, విలాసాలు తోగా సీనియర్లే కొట్టేస్తున్నారు. ఐఐటీ–బాంబే లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మూర్తి - ఐటీ రంగంలో జీతాల తేనెతుట్టె ను మరోసారి కదిపారు. సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ అసలే క్లిష్ట పరిస్థితులు - ఇబ్బందుల్లో ఉన్న ఇలాంటి అననుకూల సమయంలో ఉన్నతస్థాయి లేదా మేనేజ్‌మెంట్‌ స్థాయిలోని సీనియర్‌ ఉద్యోగులు తమ వేతనాలను భారీగా పెంచుకోవడం ఆమోదయోగ్యం కాదని మూర్తి పేర్కొన్నారు. 
Image result for narayana murthy in iit mumbai

పెట్టుబడిదారీ వ్యవస్థపై (క్యాపిటలిజం) సామాన్యులకు నమ్మకాన్ని పెంపొందించాలంటే, సీనియర్లు తమ జీతాల విషయంలో త్యాగాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. ఉన్న మధ్య క్రింది స్థాయి ఉద్యోగుల జీత భత్యాల అంతరం పెట్టుబడిదారీ వ్యవస్థకు అంత శ్రేయస్కరం కాదని ఆయన నొక్కి వక్కాణ్ ఇంచారు.   

Image result for narayana murthy in iit mumbai

కృత్రిమ మేధ లేదా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), యాంత్రీకరణ లేదా మెకనైజేషణ్ (ఆటోమేషన్‌) కారణంగా ఐటీ పరిశ్రమలో ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందన్న ఆందోళన లను ఆయన తోసిపుచ్చారు. ఐటీనే తీసుకుంటే, వాస్తవాలను పక్కనబెట్టి వీటిని మరీ అతిగా ఆలోచిస్తున్నారని మరీ అతిగా చూపుతున్నారని స్పష్టం చేశారు. ఇన్ఫోసిస్‌ మాజీ  సీఈఓ, విశాల్‌సిక్కా, ఇతరత్రా కొందరు సీనియర్లకు భారీ వేతన ప్యాకేజీల విషయంలో నారాయణ మూర్తి గతంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం, ఫలితంగా విశాల్ సిక్కా ఇన్=ఫోసిస్ నుండి వైదొలగడం అందరికి తెలిసిందే.

Image result for narayana murthy in iit mumbai

ఐటీలో సమస్యలన్నీ తాత్కాలికమే, అసలు ఇప్పుడు ఐటీ రంగం సంక్లిష్ట పరిస్థితుల్లోనూ, ప్రపంచ వాప్తంగా ముఖ్యంగా అమెరికా వంటి దేశాల ప్రభుత్వాల్లో వస్తున్న మార్పు లు, మారుతున్న చట్టాల వలన కష్టకాలంలోకి జారిపోతోందని నారాయణ మూర్తి అంగీకరించారు. అయితే, కొన్నేళ్లకోసారి ఇలాంటి పరిస్థితులు నెలకొనడం(సైక్లికల్‌)సాధారణమేనని, తనను సవరించు కొని ఐటి పరిశ్రమ మళ్లీ గాడిలో పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Image result for narayana murthy in iit mumbai

"అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన కంపెనీలు మన ఐటీ రంగానికి ప్రధానమైన వినియోగదారులుగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్లు మళ్లీ కొత్తగా పెట్టుబడులు పెట్టే ముందు, ఇప్పటివరకూ వెచ్చించిన పెట్టుబడులపై  ప్రయోజనాల కోసం నిరీక్షిస్తు న్నారని అందుకే ప్రస్తుతం ఐటీ పరిశ్రమ మందగమనంలో ఉండవలసి వస్తోంది" అని పేర్కొన్నారు. ఈ ఐఐటి ఫెస్టివల్ లో భారత మాజీ ఆర్ధిక శాఖా మాత్యులు పి చిదంబరం కూడా పాల్గొన్నారు.

Image result for narayana murthy in iit mumbai

మరింత సమాచారం తెలుసుకోండి: