గుజరాత్ ఎన్నికల ముందూ ఆ తరవాత  "భారతీయ మీడియా" భారతీయ జనతా పార్టీ పై తమ ఆగ్రహాన్ని కక్షను వెళ్ళగ్రక్కు తుంది. అంత విద్వేషం దీనికవసరమా? ముఖ్యంగా గుజరాత్ లో బాజపా విజయాన్ని ప్రక్కన బెట్టి కాంగ్రెస్ దే నైతిక విజయం అంటూ 'టివి తెరలు చించేసింది,పేజీలు నింపేసింది'  అసలు విజయమంటే సగానికి పైగా ఒక్క స్థానం ఎక్కువ గెలిచినా అది గెలుపే. ఆ విధంగా బాజపా 182 స్థానాల్లో సగం అంటే 91 స్థానాల మీద ఒక్క స్థానం ఎక్కువ సంపాదించినా మీరు గెలిచినట్లె.
Image result for media downgreaded BJP winning in by elections
అంటే బాజపా 99 స్థానాలు గెలిచిన బాజపా విజయం విజయం కాదని, 77 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ విజయం నైతిక విజయ మంటూ గుప్పించేసింది. ఎన్నికల్లో విజయం మాత్రమే ఉంటుంది. నైతిక విజయం అంటూ ఉండదు. నైతిక విజయంతో కాంగ్రెస్ పాలన కొనసాగించలేదు కదా! మరెందుకు మీడియాకీ కక్ష, కార్పణ్యం బాజపా మీద?  మరి హిమాచల్ లో కాంగ్రెస్ పొందిన ధారుణపరాభవం లెక్కలోకి రాదా? మరక్కడ ఆ పరాభవం గురించి ఏ మీడియాగూడా పెద్దగా పట్టించుకోక పోవటానికి కారణమేమిటి?  

Image result for recent by elections bjp performance

తాజాగా దేశ వ్యాప్తంగా ఐదు స్థానాలలో జరిగిన ఉపఎన్నికలల్లో బిజెపి మూడు స్థానాలను గెలుచుకుంది. వీటిలో 2 కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు కాగా ఒకటి బిజెపి స్థానం.  అంటే కాంగ్రేస్ రెండు స్థానాలు బిజేపి గెలుచుకున్నట్లేకదా! ఇకపోతే తృణమూల్ కాంగ్రెస్ ఒక స్థానం గెలుచుకుంది, ఇది కూడా గతంలో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. అలాగే తమిళనాడులో టిటివి దినకరన్ గతంలో దివంగత జయలలితకు చెందిన స్థానంలో గెలిచారు.



అయితే ఏ ఒక్క మీడియా కూడా బిజెపి మూడు స్థానాల్లో గెలిచిన సమాచారం గురించి వార్తలు ప్రముఖంగా రాయలేదు. "టిటివి దినకరన్ ఘనవిజయం, తృణమూల్ విజయపతాకం" అంటూ ప్రధానంగా రాశాయి. అలాగే తమిళనాడులో బిజెపి పొందిన అతి తక్కువ ఓట్ల సంఖ్య గురించి మాత్రం "తమిళనాడులో బిజెపికి ఘోరపరాభవం, నోటా కంటే తక్కువ ఓట్లు" అంటూ వార్తలు గుప్పించేశాయి. అసలు బిజెపికి తమిళనాడులో ఉనికే లేదు. దానికి ఎన్ని ఓట్లు వస్తే ఏం లాభం. "ఉనికి లేని చోట పరాభవం" ఎన్నికల్లో అసలుండదు.
Image result for rk nagar result 2017
తెగ రెచ్చిపోయిన మీడియా మరి గెలిచిన చోట ఎందుకు నిష్పాక్షికంగా వార్త రాయలేదు? ఇందులో ట్రాజెడీ ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ తన మూడు సిట్టింగ్ స్థానాలలో డిపాజిట్లు కూడా కోల్పోయింది. ఆ విషయాన్నీ ఏ మీడియా కూడా వెలుగులోకి వచ్చేలా రాయలేదు. దీన్నే పక్షపాతం అనరా? ఇలాంటి రాతలు, వార్తల వలన మీడియా తనపై ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని క్రమంగా పోగొట్టుకుంటున్నది. 


లక్షల కోట్ల అక్రమార్జనతో జైలు పాలైన శశికళ బందువు అనుంగు సహచరుడు టిటివి దినకరన్ గెలుపు కూడా గతంలో వైఎస్ జగన్ మోహన రెడ్డి గెలిచిన దానికి దగ్గరగా లేదా? నాడు అధికార కాంగ్రెస్ స్థానాన్ని అత్యద్భుతంగా గెలిచిన జగన్ మోహనరెడ్డి ముందు సిగ్గుపోగొట్టుకుంది నేడు మీడియా మెచ్చే కాంగ్రెస్. కాని ఉనికే లేని బాజపా ఒటమి ఎప్పటికీ పరాభవం కాదు. తమిళ నాడులో తమిళ పార్టీలే గెలుస్థాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. కాంగ్రెస్ కాదు, బాజపానే కాదు, దానబ్బ కూడా తమిళనాడులో గెలవటం అసాధ్యం.     

మరింత సమాచారం తెలుసుకోండి: