దేశం అంతా ఊహించినట్లుగానే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.నమో జపం చేస్తున్న యావత్ భారతం తో పాటు దానికి మేము అతీతులు కాదు మేము మోడీ వెంటే అంటూ గుజరాత్,హిమాచల్ ప్రదేశ్ ల ఓటర్లు బిజెపి కి బ్రహ్మరథం పట్టారు.దాదాపు ఐదేళ్ళ తర్వాత హిమాచల్ ప్రదేశ్ బిజెపి సొంతమవ్వగా , బిజెపి కి కంచు కోట అయిన గుజరాత్ లో ఆశించిన స్థాయికంటే ఫలితాలు వెలువడక పోవడం బిజెపి కి భవిష్యత్తులో జరిగే పరిణామాలను ఆలోచింపజేయసాగింది.గుజరాత్ లో 182 స్థానాలకుగాను బిజిపి 99 ,కాంగ్రెస్ 80 ,ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు ,ఇక హిమాచల్ లో 68 స్థానాలకు బిజెపి 44 ,కాంగ్రెస్ 21 ,ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు .

ఇక్కడ అభివృద్ధి  ,అక్కడ అవినీతి :

గుజరాత్ లో పటీదార్ల పోరాట అధ్యక్ష్యుడు హార్దిక్ పటేల్ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన తరుణంలో బిజెపి తన అభివృద్ధి అస్త్రాన్నే నమ్ముకుంది. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ వంటి భారీ ప్రాజెక్టుల వల్ల ప్రభుత్వ సంపద వృధా ,జియస్టి  ,నోట్ల రద్దు వాళ్ళ నష్టపోయింది సామాన్యుడే అన్న కాంగ్రెస్ నాయకుల విమర్శనలకు తూట్లు పొడుస్తూ వెలువడిన ఈ ఫలితాలు గుజరాత్ ప్రజలు ఈ ప్రాజెక్ట్ వల్ల సంతృప్తిగానే ఉన్నారన్న ధోరణి కనబడుతుంది.

Image result for bjp congress

ఇక హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ను గద్దె దించడానికి బిజెపి వాడుకున్న ప్రధాన అస్త్రం అవినీతి .దేశం లో కాంగ్రెస్ హయం లో జరిగిన 2జి స్పెక్ట్రమ్ కేసు ,ముఖ్యంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి వీరభద్ర సింగ్ పై అవినీతి  ఆరోపణలు ,ఆయన కుటుంబ సభ్యులపై సిబిఐ విచారణలు బిజెపి నాయకుల ప్రసంగాలలో ముఖ్య అంశాలు అవడమేకాక ,ఫలితాలను కూడా ప్రభావితం చేసాయి అని అనడంలో అతిశయోక్తి లేదు .

కొంపముంచిన వీడియో పుటేజ్ ,అయ్యర్ కామెంట్


గుజరాత్ ఎన్నికల ముందు  రెండు సంఘటనలు బిజెపి కి వరం అయ్యాయి .  పటీదార్ల పోరాట అధ్యక్ష్యుడు హార్దిక్ పటేల్ తన గదిలో అమ్మాయితో రహస్యంగా గడుపుతున్న వీడియో పుటెజ్ బయటకి రావడం , మణిశంకర్ అయ్యర్ ప్రధాని మోడీ ని “నీచ్ “ అని సంభోదించడం బిజెపి కి వరం అయ్యాయి.మోడీ తన ప్రసంగాలలో ప్రస్తావిస్తూ అయ్యర కేవలం తనను మాత్రమే నీచ్ అనలేదని యావత్ గుజరాత్ ప్రజలని అందరిని అన్నాడని మోడీ విమర్శించడం విదితమే .

ఫలితాలలో ఏ మాత్రం తీసిపోని కాంగ్రెస్


ఎన్నికలలో జయాపజయాలను ప్రక్కనపెడితే కాంగ్రెస్ గట్టి పోటీనే ఇచ్చిందని మనం చెప్పవచ్చు.కాంగ్రెస్ అధ్యక్షుడి భాధ్యతలను తీసుకున్న రాహుల్ తన మొదటి పోరాటంలో ఒకింత సఫలుదయ్యాడని ఫలితాలని చూస్తేనే తెలుస్తుంది .ఒక్కడు తన భుజాలపై ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించాడు,ఒక వైపు జియస్టి ,నోట్ల రద్దు ,నిరుద్యోగం అన్న  అంశాలను విమర్శిస్తూనే రైతుల ,విద్యార్థుల సమస్యలను వివరిస్తూ వారి మద్దతును కూడగాట్టుకున్నాడు.ఫలితంగానే 2012 ఎన్నికలలో కాంగ్రెస్ సాధించిన ఓట్ల శాతం 38 కాగా ఈ సారి ఏకంగా 7 శాతం మెరుగుపరుచుకొని 45  శాతం ఓట్లను రాబట్టింది .


బిజెపి రాజ్యాలు 19

Image result for bjp

ఈ రెండు రాష్ట్త్ర ఎన్నికలలో  విజయ బావుటా ఎగరవేసిన బిజెపి తను పరిపాలించే రాష్ట్రాలను 19 కి చేర్చుకుంది .2019 సార్వత్రిక ఎన్నికలలో అన్ని రాష్ట్రాలలో పార్టీ జెండాను ఎగరవేయాలని ఉంది.ఒక వైపు కాంగ్రెస్ కూడా తన ప్రాభల్యం ఉన్న ప్రాంతాలలో తిరిగి అధికారాన్ని చేజేక్కించుకోవటానికి వ్యూహాలను రచిస్తుంది .     




మరింత సమాచారం తెలుసుకోండి: