ఈ ప్రశ్న మీ ఒక్కరికే కాదు ప్రంపంచం లో ఉన్న అందరి మదిలో మెదులుతూనే ఉంటుంది .అవును రోజురోజుకీ ఉత్తర కొరియా అధ్యక్ష్యు డు కిమ్ జంగ్ ఉన్  , అమెరికా అద్యక్ష్యుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య మాటల తీవ్రత ఉగ్రరూపం  దాలుస్తుంది. సునామి ముందు వాతావరణం  తన ప్రతాపాన్ని ,కోపాన్ని ఎలా చూపిచుస్తుందో వీరిద్దరి చర్యలు కూడా ఇంతకంటే   మరింత వేడిగా రాజుకుంటున్నాయి .ఇంతకీ ప్రపంచయుద్దం చేసే నష్టం అంతా ఇంతా కాదు అదే ఈ కాలంలో సంభవిస్తే మాత్రం అగ్ర రాజ్యం ,పెద్దన్న అమెరికానే తిరిగి కోలుకోవడానికి ఒక దశాబ్ద కాలం పడుతుంది.

 

కిమ్ దుందుడుకు చర్య :

రెండవ ప్రపంచ యుద్ధం రావడానికి జర్మన్ నియంత హిల్టర్ ఎంత భాద్యుడో అందరికి విధితమే,మూడవ ప్రపంచ యుద్ధం రావడానికి కిమ్ మాత్రమే కారకుడవుతాడని అతడి చేష్టలే తెలుపుతున్నాయి,అందుకు నిదర్శనం అంతర్జాతీయ సమాఖ్య ఐక్యరాజ్యసమితి ఆదేశాలను లెక్కచేయకుండా అణుస్థావరాలను ఏర్పాటుచేకోవడం ,అణుప్రయోగాలు చేయడం,క్షిపణులను పరీక్షించడం వంటివి పొరుగుదేశాలను మాత్రమే కాక పెద్దన్న అమెరికాను సైతం తన చర్యలద్వారా డేగ కన్నుతో ఉత్తరకొరియాను ఒక కంటపెట్టేలా దృష్టిసారించుకుంది .

Image result for kim jong trump war

ఆసక్తిని రేపిన ట్రంప్ ఆసియా దేశాల ప్రదర్శన :

నవంబర్ 3 నుండి చైనా ,జపాన్,ఫిలిప్ఫైన్స్ ,దక్షిణ కొరియా ,వియత్నాం లలో పర్యటించిన ట్రంప్ ,ఈ పర్యటనల ప్రధానాంశం కేవలం ఉత్తర కొరియా తీవ్రతను తగ్గించడానికే అని చెప్పకనే మనకి తెలిసిపోయింది .చైనా మీద ఒత్తిడిని పెంచి ఉత్తర కొరియా తీవ్రతను,శత్రుత్వాన్ని  తగ్గించాలని అమెరికా భావించింది.దౌత్యపరమైన అంశాలను సైతం లెక్కచేయని ఉత్తర కొరియా ,ట్రంప్ పర్యటన అప్పట్లో ఆలోచింపచేయసాగింది.

 

కొనసాగిన మాటల పర్వం :

దక్షిణ ఆసియా పర్యటనలో ఉన్న ట్రంప్ ను కిమ్ “ట్రంప్ ఒక వృద్దుడు ,ఆయనవల్ల ఏమి కాదంటూ అనడం” ,దానికి ప్రతిమాటగా “కిమ్ పొట్టివాడు,లావుగా ఉంటాడు అని నేను ఎప్పుడైనా అన్నాన? ఒకవేళ స్నేహంలో ఉంటే అలా అనేవాడినేమో “ అని ట్రంప్ వ్యాఖ్యానించడం అప్పట్లో తీవ్ర దుమారాన్నే లేపాయి .దక్షిణ కొరియా సమీపంలో ఇరు దేశాలు వార్హెడ్ ,యుద్దవిమానాలను నెలకొల్పడం పరిస్థితిని చేజారిపోయేలాచేశాయి.   

ఏది ఏమి అయినప్పటికీ సునామి వచ్చే ముందు సముద్రం ఎంత శాంతంగా ఉంటుందో కిమ్ ఈమధ్య కాలంలో ఎటువంటి ప్రకటన చేయకపోవడం ప్రపంచదేశాలను విస్మయానికి ,ఆలోచనలకు,ఆందోళనకు గురిచేస్తుంది .


మరింత సమాచారం తెలుసుకోండి: