భారత దేశంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పదే పదే దాడులు జరుపుతూనే ఉన్నారు.  అయితే ఉగ్రవాదుల దాడులకు భారత జవాన్లు కూడా సరైన సమాధానం ఇస్తూనే ఉన్నా..కొన్ని సందర్భాల్లో వీరమరణం పొందుతున్నారు.  జమ్మూ కశ్మీర్‌తో తీవ్రవాదులు మరోసారి సైన్యం దాడులకు పాల్పడ్డారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు నేలరాలారు.
Image result for pulwama encounter
మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో పుల్వామా జిల్లా కేంద్రంలోని 185వ బెటాలియన్‌ సీఆర్పీఎఫ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు.. తొలుత గ్రెనేడ్లు విసిరి బీభత్సం సృష్టించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు నౌషేరా సెక్టార్‌లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూట్లు పొడవగా.. అందులో సేపోయ్ జగ్సిర్ సింగ్ అనే జవాన్ వీరమరణాన్ని పొందారు.
Image result for pulwama encounter
ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని జమ్మూ కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. గంటలపాటు కొనసాగిన కౌంటర్‌ ఆపరేషన్‌లో చివరకు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.క్యాంప్‌లోని ఓ బిల్డింగ్‌లో నక్కిన ఉగ్రవాదులు దొంగచాటుగా కాల్పులు జరిపారు.   
Image result for pulwama encounter
గత ఆగస్టులోనూ సీఆర్పీఎఫ్ దళాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఎనిమిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పుల్వామా జిల్లా పోలీస్ కాంప్లెక్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడికి పాల్పడ్డారు. అలాగే అక్టోబరులో శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో బీఎస్ఎఫ్ క్యాంప్‌పై కూడా తీవ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: