తెలంగాణాపై కాంగ్ర.స్ అధిష్టానం పట్టువీడడం లేదు. పైగా తెలంగాణా ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. హైదరాబాద్ పాలన వ్యవహారాలు తేలిపోతే, తీర్మానం పార్లమెంటుకు వచ్చేస్తుంది. ఆ తరువాత ఆర్బిటరీగా ఎవరో ఒకర్ని పెడతారు కాబట్టి, మిగిలిన అధికారిక లాంఛనాల్లనీ వారు చూసుకుంటారు. హైదరాబాద్ తోనే సమస్య అంతా ముడిపడి వుందన్న సంగతిని కాంగ్రెస్ అధిష్టానం బాగా గుర్తించింది.
అందుకే ఆ సమస్యను చకచకా పరిష్కరిస్తే, చాలా వరకు సమస్యలు సద్దుమణుగుతాయని భావిస్తోంది. నిజానికి పనులన్నీ ప్రభుత్వం చేయాల్సింది.కానీ చిత్రంగా ఆంటోనీ, దిగ్విజయ్ లతో కమిటీ వేసింది పార్టీ. అసలు కేవలం తెలంగాణా ఏర్పాటుకు అనుగుణంగా సిఫార్సు వరకే కాంగ్రెస్ చేయాల్సింది. ఆ తరువాత కేబినెట్ నిర్ణయం, అసెంబ్లీ తీర్మానం, పార్లమెంటులో చర్చ వంటివి జరగాలి. ఈ క్రమంలోనే సాధ్యాసాధ్యాల కసరత్తు కూడా అదికారికంగా జరగాలి.
అలా కాకుండా ఇలా తను స్వంతంగా అన్నీ చేయడం అంటే, పార్టీకి ప్రభుత్వానికి మధ్య వున్న గీతను కాంగ్రెస్ పార్టీ చేరిపేస్తోందా? లేక ఎక్కడ ఉద్యమం పెద్దదవుతుందో అని హడావుడి పడుతోందా?

మరింత సమాచారం తెలుసుకోండి: