గజల్ శ్రీనివాస్ అడ్డంగా దొరికిపోయాడు. గలీజ్ దృశ్యాలతో నిండా మునిగిపోయాడు. తన ఆఫీసునే రాసలీలలకు వేదికగా చేసుకుని బుక్కయిపోయాడు. తనను వేధిస్తున్నాడంటూ ఓ యువతి చేసిన ఫిర్యాదుతో గజల్ శ్రీనివాస్ గలీజ్ చేష్టలు వెలుగులోకి వచ్చాయి.


గజల్ శ్రీనివాస్ వ్యవహారంపై లోతుగా విచారించిన పోలీసులకు అవాక్కయ్యే విషయాలు వెలుగుచూశాయి. పనిమనిషితో మసాజ్ చేయించుకుంటున్న దృశ్యాలు సీసీటీవీలో బయటపడ్డాయి. ఆమెతో అర్ధరాత్రి వరకూ గజల్ శ్రీనివాస్ పర్సనల్ పనులు చేయించుకునేవారంటూ వచ్చిన ఆరోపణలు ఇప్పుడు నిజమని తేలాయి. గుళ్ల పరిరక్షణ పేరుతో సేవ్ టెంపుల్ నినాదం వల్లిస్తున్న గజల్ శ్రీనివాస్ .. గుడి వెనుక మాత్రం గమ్మత్తుగా ఎంజాయ్ చేస్తున్న వ్యవహారాలు వెలుగుచూశాయి.


గజల్ శ్రీనివాస్ పనిమనిషితో అత్యంత సన్నిహితంగా ఉన్న దృశ్యాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అంతేకాక.. ఆ పనిమనిషి ఇప్పుడు ఫిర్యాదు చేసిన యువతిని కూడా పలుమార్లు వేధించినట్టు ఆమె చెప్తోంది. శ్రీనివాస్ తో సన్నిహితంగా మెలగాలంటూ ఆమె బలవంతపెట్టిందని స్పష్టంచేసింది. పక్కా ఆధారాలతో గజల్ శ్రీనివాస్ రెండో కోణాన్ని బయటపెట్టింది. సీసీ టీవీలో అతడి రాచకార్యాలు బయటపడడంతో కేసు మరింత బలపడినట్లయింది.


బాహ్య ప్రపంచానికి ఎంతో గౌరవప్రదంగా కనిపించే గజల్ శ్రీనివాస్ ఇప్పుడు చౌకబారు చేష్టలతో కెమెరాలకు దొరికిపోవడం ఆయనపై ఉన్న గౌరవాన్ని మంటగలిపింది. అమ్మపైన అద్భుతమైన పాటలతో ఆకట్టుకున్న గజల్ శ్రీనివాస్ గాంధీజి సిద్ధాంతాలను విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో 125 భాషల్లో పాటలు పాడారు. దాంతో 3 గిన్నీస్ బుక్ రికార్డులు సాధించారు. ఒక లిమ్కా బుక్ అవార్డ్ పొందారు. కానీ ఇప్పుడు ఆడదంటే అమ్మలాంటిదని మర్చిపోయి అమ్మాయిలను వేధిస్తూ దొరికిపోయాడు. పైగా అమ్మాయిలందరినీ ఇలాగే చూస్తాడంటూ బాధితురాలు చెప్పిన మాటలు రిమాండ్ రిపోర్ట్ ను బట్టి వెల్లడవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: