దాయాది దేశం పాకిస్తాన్ భారత్ తో సఖ్యతకు ఎలాంటి ప్రయత్నం చేయదు. ఎప్పుడూ అది ఏనాడు నిరంతరంగా నియంతల ఏలుబడిలోనే ఉంది. అయితే పాక్ మాజీ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ ఈ మధ్య తరచూ భారత్ వ్యతిరేక చర్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా భారత ప్రధాని నరెంద్ర మోడీ పై వ్యాఖ్యలు చేయటం లో ధిట్ట. 
Image result for pervez musharraf about narendra modi and india
  నరెంద్ర మోదీ అవలంభించే దౌత్య నీతి తమ దేశం పాక్ కు శాపంగా మారింద ని ముషారఫ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దౌత్య నిర్వహణలో మోదీ అనుసరించిన విధానాలు, పాక్‌ను అంతర్జాతీయ స్థాయి లో దోషిగా నిలబెట్టాయని అన్నారు. 


భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రతి విషయంలోనూ పాకిస్థాన్‌ను డామినేట్ చేస్తున్నారని అంతర్జాతీయ సమాజాన్ని పాక్ కు వ్యతిరేఖంగా తీవ్ర ప్రభావితం చేస్తున్న మోదీ, పాకిస్థాన్‌ను ఏకాకిగా మారుస్తున్నారని అంతర్జాతీయంగా మోదీ చేస్తున్న దౌత్యపరమైన చర్యల వల్ల పాకిస్థాన్ గౌరవం పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Related image

ప్రస్తుతం అనేక తీవ్రమైన దేశ ద్రోహ కేసుల్లో నిందితుడుగా ఉండి దుబాయిలో తల దాచుకుంటున్న ఈ మహానుభావుడు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "మీరు చెప్పండి పాకిస్థాన్‌కు అంతర్జాతీయంగా ఏమైనా గౌరవం ఉందా?" అని జర్నలిస్టును ప్రశ్నించారు. పాకిస్థాన్ పాటించే ప్రస్తుత దౌత్య నీతికి ఇక కాలం చెల్లినట్టేనని పేర్కొన్నారు. 


"భారత్ మనల్ని డామినేట్ చేస్తోంది. భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ గూఢచారి కాదని భారత్ వాదిస్తోంది, అటువంటప్పుడు లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థ అని మన మెందుకు చెప్పుకోవాలి" అని ఆ ఇంటర్వ్యూలో అన్నారు.
 Related image

లష్కరే తాయిబా, జమాత్-ఉద్-దవాలు దేశభక్తితో పరిఢవిల్లే తమ జాతీయ సంస్థలని ముషారఫ్ తాజాగా సెలవిచ్చారు. ఆ సంస్థలకు చెందిన స్వయంసేవకులు దేశం కోసం కశ్మీర్‌లో ప్రాణాలు అర్పిస్తున్నారని పేర్కొన్న ముషారఫ్ అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌, జకీవుర్ రహ్మాన్ లక్వీ లకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ముంబై పేలుళ్ల సూత్రధారి అయిన సయీద్‌ ఆధ్వర్యం లోని జమాత్-ఉద్-దవాను అమెరికా 2014 లో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది  రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్టు ఇటీవల ప్రకటించి,  2018 సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీ "మిల్లీ ముస్లిం లీగ్" పోటీ చేయనున్నట్టు హఫీజ్ సయీద్‌ పేర్కొన్నారు.  .

Image result for pervez musharraf about narendra modi and india

పాకిస్తాన్‌ న్యూస్‌ ఛానల్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో ముషారఫ్‌ మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, "అంతర్జాతీయ దౌత్య విధానాలు అవలంభించడంలో నరెంద్ర మోదీ తో తమ నేతలు పోటీపడలేక పోయారని అన్నారు. ప్రస్తుతం పాక్ ప్రభుత్వం నిష్క్రియా పరమైన దౌత్య విధానాలను అనుసరిస్తోందన్నారు. ప్రణాళిక లేని దౌత్య విధానాల వల్ల అంతర్జాతీయ ప్రపంచం నుంచి పాకిస్తాన్‌ దూరం జరిగింది" అని ఆయన అన్నారు. 
Image result for kulbhushan jadhav

"పాకిస్తాన్‌కు అంతర్జాతీయ స్థాయి లో గౌరవం ఏమైనా ఉందా? మన దౌత్య విధానం భారత ప్రధాని నరేంద్ర మోదీ కన్నా దూకుడు గా ఉండాల్సి ఉండగా ఇప్పుడు అలా లేదు కదా! నరేంద్ర మోదీ అంతర్జాతీయంగా మన దేశాన్ని ఏకాకి చేయడం నిజం కాదా?" నరేంద్ర మోదీ అనుసరిస్తున్న దూకుడుకు తగినట్లుగా సరైన దౌత్య విధానాలను పాకిస్తాన్‌ పాలకులు అనుస రించలేక పోవడం వల్ల నేడు విపత్కర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నామని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: