ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తూ ఉగ్రవాదానికీ ,టెర్రరిజానికి పుట్టినిల్లుగా పిలువబడే దేశం పాకిస్తాన్.ఉగ్రవాదులకు శిక్షణా శిబిరాలను ఏర్పరచి వాటిని సైన్యంతో పాటూ శిక్షణ ఇస్తూ ప్రపంచంపై మరీ ముఖ్యంగా భారత్ పై తీవ్ర దాడులకు పాల్పడటానికి వారిని సన్నద్దం చేస్తుందన్న విషయం విదితమే.దీనికి సంబంధించి భారత్ ఎన్నో అంతర్జాతీయ వేదికలపై ఆరోపించినప్పటికీ పాక్ దాన్ని తోసిపుచ్చుతూ వచ్చింది.

Image result for terrorist

అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఈ విషయం లేటుగా తెలిసిందో లేక ఇన్నాళ్ళ తన అధ్యక్ష పదవిలో అర్థంమయిందో  కాని నూతన సంవత్సరం రోజున పాక్ పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే .ఆయన తన ట్వీటుల్లో  పాక్ గురించి ప్రస్తావిస్తూ  అమెరికా గత 15 సంవత్సరాలలో 33 బిలియన్ అమెరికన్ డాలర్ల సహాయాన్ని పాకిస్తాన్ కు మూర్ఖంగా అందించింది. కానీ పాక్, అమెరికా అధ్యక్షులను మూర్ఖులుగా భావిస్తూ దానికి ప్రతిఫలంగా చేసిన  పని అబద్దాలు చెప్పడం,మోసం చేయడం.మేము ఆఫ్గనిస్తాన్ లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే పాక్ మాత్రం టెర్రరిస్టులకు సురక్షితమైన స్వర్గాన్ని అందిస్తున్నదని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Related image

కాగా ట్రంప్ పాక్ పై చేసిన విమర్శల గురించి చైనా విదేశిమంత్రిత్వశాఖా ప్రతినిధి జెంగ్ షాంగ్ బీజింగ్ లో మాట్లాడుతూ ,ప్రపంచ సమస్య అయిన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా విస్తారమైన ప్రయత్నాలను ,త్యాగాలను చేసింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి తనదైన సహాయసహకారాలను అందించింది ,దీనిని బట్టి అంతర్జాతీయ సమాజం పాక్ ని అభినందించాలి అని వ్యాఖ్యానించారు.కాగా చైనా ,పాక్ లో భారీగానే పెట్టుబడులు పెడుతుంది.భారత్ కు దగ్గరలో సుమారు 50 బిలియన్ అమెరికన్ డాలర్లతో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ను నిర్మిస్తున్నవిషయం తెలిసిందే .ఫలితంగా భారత్ తో ఎటువంటి సమస్య వచ్చినా పెట్టుబడి నియమావళి  ప్రకారం తమ దేశ యుద్ద విమానాలను,యుద్ద ట్యాంకులను నిలుపుకోవచ్చు.ఇలా మద్దతు తెలపడం ద్వారా పాకిస్తాన్ ను ఉపయోగించి భారత్ కు చెక్ పెట్టాలన్న ధోరణిలో ఉన్నట్లు తెలుస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: