తమిళనాడు లో గత కొంత కాలంగా రాజకీయాల్లో ఎన్నో సంచలనాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.  దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె వారసులం అంటూ తెరపైకి ఎంతో మంది వచ్చారు.  ముఖ్యంగా పన్నీర్ సెల్వం, శశికళ మద్య పెద్ద రాజకీయ యుద్దమే జరిగింది.  కానీ, శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లింది..ఆమె నమ్మిన బంటు పళని స్వామి సీఎం పీఠం ఎక్కారు..కొన్ని రోజుల తర్వాత ఆయన శశికళకు హ్యాండ్ ఇచ్చి పన్నీర్ సెల్వంతో కలిసిపోయారు. 
Image result for రజినీకాంత్ కరుణానిధి
ఇలా ఉండగా..జయలలిత మరణం తర్వాత ఆర్కేనగర్ లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల పోటీలో అధికార పక్షం, ప్రతిపక్షంతో పాటు అన్నాడీఎంకే బహిష్కుృత సభ్యుడు కరుణాకరన్ కూడా పోటీ చేసి..అనూహ్యంగా గెలుపొందారు.  ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కొత్తగా సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. 
Image result for రజినీకాంత్ కరుణానిధి
ఎప్పటి నుంచో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని అన్నా..ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు.  ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ఆయన రాజకీయాల్లోకి వస్తానని అభిమానుల సాక్షిగా తెలిపారు.  త్వరలో రాజకీయ పార్టీ పెట్టాలని భావిస్తున్న దక్షిణాది సూపర్ స్టార్, తమిళ తలైవా రజనీకాంత్, స్వయంగా డీఎంకే అధినేత కరుణానిధి వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. 

ఈ సందర్భంగా రజినీ మాట్లాడుతూ..  కరుణానిధి తనకు చిరకాల మిత్రుడని, మర్యాదపూర్వకంగానే ఆయణ్ని కలిశానని తెలిపారు. ‘దేశంలోనే కరుణానిధి సీనియర్‌ నాయకుడు. ఆయనంటే నాకు ఎంతో గౌరవం ఉంది. రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు ఆయన ఆశీస్సులు తీసుకొనేందుకు వచ్చా’ అని రజనీకాంత్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: