మొత్తానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బందీ అయ్యారు. అసలే ఆయనను సరిగా పనిచేయనీయకుండా, జగన్ పోరును, అంతర్గతపోరుతో సరిపోయేలా చేసాయి పరిస్థితులు. ప్పుడు తెలంగాణా సమస్య పుణ్యమా అని ఆయనకు మరిన్ని సమస్యలు వచ్చిపడ్డాయి. నిజనికి ఆయన రాజీనామా చేద్దామనుకున్నారు. కానీ సోనియా  ఆయనను పకడ్బందీ వ్యూహంతో బందీ చేసిందివిముక్తిని కూడా కోరుకోకుండా చేసేలా పరిస్థితులను తయారు చేసింది సోనియానే అన్న మాటలు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్థున్నాయి. ఆయనను సిఎం పదవికి ఖైదీని చేసి ఏమి చేయలేని పరిస్థితులను కల్పించింది సోనియా అంటున్నారు.

సమైక్య ఉద్యమ నేపథఢ్యంలో రాజీనామా చేసి సీమాంధ్రలో హీరో కావాలనుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. తన రోడ్ మ్యాపును కోటరీతో లీకు చేయించి కొంచెం ప్రయత్నించారు.. ఇంతలో జగన్ పార్టీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి వైఎస్సార్ సిపి ని సీమాంధ్రలో తిరుగులేని విదంగా తయారు చేయడంతో ఇక తన పని చిత్తే అని గ్రహించిన సిఎం వెంటనే వెనుకడుగు వేసారు.

కాంగ్రెస్ వర్గాలే జగన్ తో మంత్రాంగం నడిపి ఇలా చేయించి వుండొచ్చన్న వార్తలు కూడా ఇప్పుడు బయటకు పొక్కాయి. అందులో నిజముందా.. లేదా అన్నది పక్కన బెడితే సిఎం ను మాత్రం వెనుకడుగు వేయడం వాస్తవం. 

మరింత సమాచారం తెలుసుకోండి: