ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసులో అడ్డంగా బుక్కయిపోయిన సంగతి తెలిసిందే.! అయితే గజల్ శ్రీనివాస్ ను కొందరు కావాలనే ఇరికించారనే సమాచారం వినిపిస్తోంది. గజల్ శ్రీనివాస్ పరువును బజారుకీడ్చేందుకు తెరవెనుక పెద్ద కుట్రే జరిగిందనేది ఇప్పుడు హాట్ టాపిక్.

Image result for ghazal srinivas

గజల్ శ్రీనివాస్ పనిమనిషితో రాసలీలలు చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే గజల్ శ్రీనివాస్ ఇల్లీగల్ అఫైర్ బయటకు రావడానికి ప్రధాన కారణం ఆయన నేతృత్వంలోని ఆలయవాణి వెబ్ రేడియోలో పనిచేస్తున్న జాకీ.! తనను గజల్ శ్రీనివాస్ లైంగికంగా వేధించారంటూ ఆమె ఫిర్యాదు చేయడంతో తెరవెనుక బాగోతాలన్నీ బయటికొచ్చాయి. అయితే ఆమె వాంటెడ్ గానే కొన్నాళ్లుగా గజల్ శ్రీనివాస్ వీడియోలను రికార్డు చేస్తున్నారనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. ఇప్పుడు బయటికొస్తున్న వీడియోలలో ఆమె ఒకచోట మాత్రమే కనిపిస్తోంది. మిగిలినచోట్ల పనిమనిషితో గజల్ శ్రీనివాస్ రాసలీలలు మాత్రమే ఉన్నాయి.

Image result for ghazal srinivas

గజల్ శ్రీనివాస్ తో పనిమనిషికి వివాహేతర సంబంధం ఉందని తేటతెల్లమైంది. అది వారిద్దరి వ్యక్తిగత వ్యవహారం. ఆ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది మాత్రం రేడియో జాకీ.! అయితే ఆ జాకీ ఇలా వెలుగులోకి తీసుకురావడం వెనుక ఓ మీడియా పెద్ద ఉన్నారనేది పొలిటికల్, మీడియా టాక్. 4 నెలలుగా గజల్ శ్రీనివాస్ తో అత్యంత సన్నిహితంగానే ఉంటూ ఆయన తెరవెనుక వ్యవహారాలను రికార్డ్ చేసి బయటకు తీసుకురావడం వెనుక ఓ పెద్ద తలకాయ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Image result for ghazal srinivas

ఈ ఏడాది ఆధ్యాత్మిక విభాగంలో పద్మశ్రీ ఆశిస్తున్నారు గజల్ శ్రీనివాస్. పద్మశ్రీకోసం ఆ మీడియాధిపతి కూడా పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో గజల్ శ్రీనివాస్ రేసులో కాస్త ముందుండడంతో ఎలాగైనా అతడిని వెనక్కు నెట్టాలనుకున్న ఆ మీడియాధిపతి .. గజల్ ను గలీజ్ చేసేందుకు పూనుకున్నాడనేది కొంతమంది వినిపిస్తున్న వాదన. వాస్తవానికి రేడియో జాకీతో గజల్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆధారాల్లేవు.. అలాంటి వీడియోలు కూడా బయటకు రాలేదు. అయితే పనిమనిషితో గజల్ శ్రీనివాస్ అక్రమ సంబంధం మాత్రం బయటికొచ్చింది. అది వారిద్దరి వ్యక్తిగత వ్యవహారం. దాన్ని ఈరోజు బయటపెట్టి గజల్ శ్రీనివాస్ ను రోడ్డుపైకి తీసుకురావడం వెనుక ఆ పెద్దాయన కుట్ర ఉందనేది ఇప్పుడు టాక్. ఆయనకు ప్రభుత్వంలోని కొంతమంది సహకరించారనే వాదన కూడా వినిపిస్తోంది.

Image result for ghazal srinivas

కోర్టులో కూడా ఆ తరహా వాదనలే వినిపించాయి. స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యవహారాలపై కేసులు ఎలా దాఖలు చేస్తారని గజల్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. అందుకు సంబంధించి ఆయన కొన్ని ఆధారాలను కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో ప్రసారమవుతున్న వీడియోలను ఎందుకు కోర్టుకు సమర్పించలేదని ప్రశ్నించింది. ఏ2గా చెప్తున్న పార్వతి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తుంటే.. ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీసింది. దీంతో.. పోలీసులు కావాలనే గజల్ కు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ఇలా తాత్సారం చేస్తున్నారనేది కూడా మరో మాట.  


మరింత సమాచారం తెలుసుకోండి: