అసలు హెచ్-1 బి విస మూడేళ్ళ కోసం విడుదల చేయటమేకాదు దానికి మరోసారి మూడేళ్ళు పొడిగించుకునే అవకాశంఉంది. ఈ మధ్యలో గ్రీన్ కార్దుకు దరకాస్తు చేసుకునే అవకాశం తోనే హెచ్-1 బి. విడుదల చేస్తారు. దీనికి ప్రతిఫలంగా సాంకేతిక నిపుణులు తమ నీపుణ్యం ఆ దేశానికి అందిస్థారు. తద్వారా ఆ దేశాభివృద్ధిలో భాగం పంచుకుంటారు. అయితే ఈ ఆశల  పల్లకిని నేలకూల్చారు అధ్యక్షుడౌతూనే డొనాల్డ్ టంప్. 

Image result for h-1 b visa cut short  opposed in american congress

హెచ్‌-1బీ. వీసా నియంత్రణపై డొనాల్డ్ ట్రంప్‌ యంత్రాంగం తలపెట్టినచర్యలను కొందరు అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో ఇండియన్ ఐటీ రంగానికి చెందిన నిపుణులఆశలు మళ్ళా పరిమళాలు ప్రభవిస్తున్నాయి. హెచ్‌-1బీ. వీసాలను తగ్గిస్తే 7.5 లక్షల మంది వరకు భారత సాంకేతిక వృత్తినిపుణులు అమెరికా  విడిచివెళతారని, దీంతో అమెరికా ను స్కిల్ల్స్ కొరత వెంటాడుతుందని అమెరికన్ కాంగ్రెస్‌ సభ్యులతో పాటు అనేక ఇండో-అమెరికన్‌ సంస్థలు డొనాల్డ్ ట్రంప్‌ యంత్రాంగా న్ని బలంగా హెచ్చరిస్తున్నాయి.
Image result for h-1 b visa cut short  opposed in american congress
అమెరికన్ల కే ఉద్యోగాలనే డొనాల్ద్ ట్రంప్‌ ఎన్నికల వాగ్ధానలలో భాగంగా హెచ్‌-1బీ. వీసాల నియంత్రణను అమెరికా వెలుగులోకి తెచ్చింది.  హెచ్‌-1బీ వీసాలు కలిగినవారిపై ఈ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ నిరంకుశ నియంత్రణలు వారి కుటుంబాలను విచ్ఛిన్నం చేయటమే కాకుండా, అమెరికా సంస్థల్లో ధారుణ నైపుణ్యాల కొరత ఏర్పడి మొత్తం వ్యవస్తే కుంటుపడుతుందని, అంతేకాకుండా ఇండియా లాంటి ప్రధాన భాగస్వామితో ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి అని డెమొక్రటిక్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యురాలు తులసి గబార్డ్ అన్నారు. అన్నింటికీ మించి అమెరికాకు అత్యంత కీలక భాగస్వామి అయిన భారత్‌ తో సంబంధాలు దెబ్బతింటాయని అన్నారు. 
Image result for tulsi gabbard

ప్రభుత్వ నిర్ణయంతో చిన్న చిన్న వాణిజ్యసంస్థల ద్వారా ఉద్యోగాలను సృష్టిస్తూ అమెరికా ఆర్థికవ్యవస్థకు బలమైన ఊతం గా ఉన్న భారత హెచ్‌-1బీ వీసా హోల్డర్లు దేశాన్ని వీడే పరిస్థితి నెలకొంటుందని అన్నారు. రానున్న శతాబ్ధంలో ప్రపంచ ఆర్థికవ్యవస్థతో అమెరికా పోటీపడే క్రమంలో నైపుణ్యాలలేమి ఆ దేశాభివృద్దికి అవరోధంగా నిలవబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్‌-1బీ వీసా గడువు పెంపును నిరాకరిస్తూ డొనాల్డ్ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై  ఇండో అమెరికన్‌ ఫౌండేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది.
Image result for h-1 b visa cut short  opposed in american congress

నైపుణ్యంతో కూడిన వేలాది మంది నిపుణులను అమెరికా ఎలా వదులుకొని తిప్పిపంపుతుందని ప్రశ్నించింది. మరోవైపు ఈ ప్రతిపాదనను డొనాల్డ్ ట్రంప్‌ యంత్రాంగం వెంటనే విరమించాలని ఇండో అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి కోరారు.

ఈ ప్రతిపాదన అమెరికాకు దాని అభివృద్దికి మూలమైన "వలస"లకు వ్యతిరేకమైనదని మరో సభ్యుడు ఆర్‌. ఖన్నా వ్యాఖ్యా నించారు. ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని కోరారు. ఇది వలసదారుల వ్యతిరేక విధానమని మరో కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా అన్నారు. మా తల్లిదండ్రులు హెచ్1బీ వీసాలపైనే ఇక్కడికి వచ్చారు.

సుందర్ పిచాయ్, ఎలోన్ మస్క్, సత్య నాదెళ్ల కూడా ఇలాగే వచ్చారు. ఇప్పుడు ట్రంప్ అలాంటి వాళ్లను  కాదనడం దారుణం. అసలు ఇండియన్స్ లేని అమెరికా ఇంత గొప్పగా అభివృద్ధి చెందేదా?  అని ట్రంప్‌ను ఆయన ప్రశ్నించారు.

Image result for r khanna american congress

Five Indian Americans sworn in to US Congress/Senate 

మరింత సమాచారం తెలుసుకోండి: