సంక్రాంతి పండుగ దగ్గరకు వచేస్తుండ గా కోడిపుంజు ప్రియులు కోర్టుకెక్కడం స్టార్ట్ చేసారు ..ఈ క్రమంలో కోడిపందాల మీదే కాకుండా అశ్లీల నృత్యాల మీదకు పిటిషన్ వేయడం జరిగింది. గోదావరి జిల్లాలో ఎక్కువ జరుగుతున్నాయని పిటీషన్లు పిటిషనర్ పేర్కొన్నారు.

కోర్టు గత సంక్రాంతి అప్పుడు ఇచ్చిన ఆదేశాలు కూడా సర్కార్  సరిగ్గా అమలు చేయలేదని అక్షంతలు వేసి తీవ్ర అసంతృప్తి వ్యక్తపరిచింది.  ఈ సంక్రాంతి పండుగ కు  ఎటువంటి అవాంతరాలు జరగకుండా అసాంఘిక  కార్యక్రమాలకు చోటులేకుండా చూసుకోవాలని రాష్ట్ర పోలీసు శాఖకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఏడాది పండుగ సంద‌ర్భంగా ఎక్క‌డా కోడి పందాలు జరక్కుండా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ స్ప‌ష్టం చేసింది. అంతేకాకుండా ముఖ్యంగా  గోదావరి జిల్లాలో డేగ కన్నుతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి కోడిపందాలు జరగకుండా పోలీసులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోర్టు కోరడం విశేషం. ప్రభుత్వం తరఫున నుంచి కూడా ఈ మ్యాటర్ చాలా సీరియస్ గా ఉన్నట్టు సమాచారం.

ఎప్పుడూ నేషనల్ మరియూ లోకల్ మీడియా లో ప్రభుత్వం కోడి పందేలు ఆపలేకపోతోంది అంటూ నెగెటివ్ గా అనిపించుకుంటున్న చంద్రబాబు సర్కారు ఈ సారి ఎలాగైనా పాజిటివ్ ఇంపాక్ట్ సృష్టించాలి అని చూస్తున్నారు. అందుకే పోలీసులకి చంద్రబాబు స్పెషల్ ఆదేశాలు ఇచ్చారు అనీ .. ఒకప్పటి లెక్క లాగా ఇప్పుడు కాదు అనీ కోడి పందేలు జరిపే సమస్యే లేకుండా చేస్తారు అని టాక్ వస్తోంది .. అయితే కోడి పందేలు నడిపే జనల మైండ్ లలో మాత్రం హడావిడి అంతా పోలీసులదే అన్నట్టుగా చూపించ బోతున్నారు .. మీడియా లో మాత్రం ప్రభుత్వం గొప్పతనం అంటారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: