పశ్చిమ బంగ రాష్ట్ర ముఖ్యమంత్రి, బంగాలీయుల దీదీ, మమతా బెనర్జీ పై  రాజకీయ కక్ష తీర్చుకోడానికే నరేంద్ర మోదీ నాయకత్వం లొని బాజపా "తలాక్" చట్టం తీసు కొస్తుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తలాక్ చట్టం అమల్లోకి తేవడం తద్వారా ఒక దెబ్బకు రెండుపిట్టల్లా అటు ముస్లిం మహిళల అభిమానం చూరగొంటూ, ఇటు తన రాజకీయ శత్రువు మమతా బెనర్జీకి సరిగ్గా షాక్ ఇచ్చి తద్వారా బెంగాల్ లో పాగా వెయ్యడానికి బీజేపీ పావులు కదపబోతుందంటున్నారు. ఈ విషయం కొంత అభ్యంతర కరం గా ఉన్నా నిజంగా ఇది వాస్తవమేనని ప్రస్తుత పరిణామాలు సూచిస్తున్నాయి. 

Image result for bjp in west bengal and ishrat jahan

ముస్లిం మహిళల "సౌభాగ్యం స్వావలంబన" బాజపా లక్ష్యమని చెపుతూ ముందుకు కొనసాగుతున్న 'నమో'  లోని దుర్నిరీక్ష్య  లక్ష్యం ఈ అంశంలో అంత పట్టుదల ఎందు కంటే  "ముస్లిం ఓటు బ్యాంకు" మీద దృష్టి పెట్టిన కమలనాధులు ఇంత శ్రద్దగా వ్యూహాలు పన్నుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.  "తలాక్ ఉద్యమ జన్మస్థానం" బెంగాల్. ఇది "తలాక్ ఉద్యమ పురిటిగడ్డ"  
Image result for bjp in west bengal and ishrat jahan
"తలాక్ తలాక్ తలాక్ సాంప్రదాయం" పై ముస్లిం మహిళ ప్రతిఘటన ప్రకటిస్తూ న్యాయస్థానం ద్వారా ప్రభుత్వాన్ని కది లించి, సంచలనం సృష్టించిన ఐదుగురు పిటిషనర్లలో "ఇష్రత్ జహాన్" ఒకరు. ముస్లిం రాజ్యం దుబాయ్ లో ఉంటూ తన భర్త ముమ్మారు తలాక్ చెప్పి తనను రోడ్డు పైకి ఈడ్చాడంటూ తనను అన్యాయంగా వదిలేశా రంటూ ఇష్రత్ జహాన్ చూపిన తెగువ ఉద్యమ శీలత బెంగాల్లో మహిళల హృదయాలలో ఎప్పట్నుంచో దాగున్న బడబాలనం ఒక్క సారిగా లావాలా బయటకి చిమ్మి నట్లుంది. చారిత్రాత్మక హౌరా జిల్లాకు చెందిన ఇష్రత్ జహాన్ తెగువ, అలుపెరుగని పోరాటంతో, బాగా ప్రచారం పొందింది ఇష్రత్ జహాన్ ఆ సేతు హిమాచలం వరకు. 

నాలుగురోజుల కిందట ఇష్రత్ జహాన్ బీజేపీలో చేరి, బెంగాల్ బాజపా - అదే కమలదళానికి వెన్నుదన్నుగా నిలబడింది. అలా  ఈమె తరఫున కోర్టులో కేసువాదించిన మహిళా న్యాయవాది నజియా ఇలాహీ ఖాన్ సైతం బాజపా తీర్ధం పుచ్చుకున్నారు. బెంగాల్ బాజపా అధినేత దిలీప్ ఘోష్ సమక్షంలో ఈమె బీజేపీ తీర్థంతీసుకుంది. ఆ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్య మంత్రి మమతాబెనర్జీ తమకు ఎలాంటి సహకారాం అందించలెదంటూ ఇప్పటికే రాజకీయ ప్రచార ప్రసంగం చేయడం ప్రారంభించారు. 

Image result for bjp in west bengal and ishrat jahan
ఈ మధ్య తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, ఆ పార్టీ మాజీ ఎంపీ ముకుల్ రాయ్ బాజపా లో చేరి, దీదీ మమతా బెనర్జీ రాజకీయ పతనమే ధ్యేయంగా  రాజకీయ కురుక్షెత్రం  మొదలు పెట్టారు. బెంగాల్ లో బాజపా వేళ్ళూనుకోవటానికి రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే, ఈ ఇరువురు ముస్లిం మహిళలూ బాజపాలో చేరినట్లు తెలుస్తోంది. 

Image result for bjp in west bengal and ishrat jahan

ప్రస్తుతానికి వీరిద్దరికీ పార్టీలో ఎటువంటి పదవులూ ఇవ్వనప్పటికీ, అటు మహిళా ఓటు బ్యాంకు, ఇటు ముస్లిం ఓటు బ్యాంకు ల్ని ఆకర్షించడానికి వీరి బాజపా ప్రవేశం పునాదులు వేస్తాయని బెంగాల్ బాజపా భావిస్తోంది. ఇది  నరెంద్ర మోదీ ప్రభుత్వానికి కంటిలోన నలుసు, చెవిలోని జోరీగ, కాలిలోన ముల్లులా మారిన మమతా బెనర్జీకి, ఆమె ప్రభుత్వానికి వరుస చురకలంటిస్తూ, తృణమూల్ కాంగ్రెస్ నైతిక, మానసిక, ఆత్మ స్థైర్యాన్ని దెబ్బగొడుతూ మోడీ-షా వేసిన రాజకీయ ఎత్తుగడ కావచ్చని అంటు న్నారు విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: