విద్యాబాలన్ డర్టీ పిక్చర్ చూసే ఉంటారు.. సినీరంగంలో ఎదిగేందుకు.. అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఓ హీరోయిన్ పతనావస్థకు చేరిన తీరు కళ్లకు కట్టినట్టు 
చూపిస్తారు. అప్పటి నుంచి డర్టీ పిక్చర్ అంటే సెక్సీ ఇమేజ్ వచ్చేసింది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే డర్టీ పిక్చర్ మాత్రం చాలా స్ఫూర్తివంతమైంది. నలుగురి మేలు కోసం ఓ ఫోటో గ్రాఫర్ చేస్తున్న వింత ప్రయత్నం..



ఔను.. ఇనా మకోసి అనే ఈ ఫోటో గ్రాఫర్ అందమైన మోడల్స్ ఫోటో షూట్లు చే్స్తుంది. కానీ ఆమె ఎంచుకునే బ్యాక్ గ్రవుండ్ ఏంటో తెలుసుకుంటే షాక్ అవుతారు. చెత్త కుప్పల మధ్యన, డంపింగ్ యార్డుల వంటి ప్రదేశాల మధ్య.. అత్యంత చెత్త ప్రదేశాలను సెలక్ట్ చేసుకుని మరీ వాటి మధ్య  అందమైన భామలు ఫోజులు ఇస్తుంటే ఆమె తన కెమేరాలో వారి దృశ్యాలను బంధిస్తుంది. 



అదేంటి ఎవరైనా అందమైన లొకేషన్లలలో ఫోటో షూట్లు చేస్తారు కదా అనుకుంటున్నారా.. అదే ఇనా మకోసి స్పషాలిటీ.. ఈమే ఈ ప్రయత్నం చేసేది.. ఆయా ప్రదేశాల బాగు కోసం.. ఇలా ఫోటోలు దిగితే బాగు చేస్తారా అని ప్రశ్నించవచ్చు..అందుకు ఇనా దగ్గర సమాధానం సిద్దంగా ఉంది. అందమైన అమ్మాయిలు.. అలాంటి చెత్త ప్రదేశాల్లో ఫోటో దిగితే జనం తప్పకుండా ఆలోచిస్తారన్నది ఆమె కాన్సెప్ట్.. 



అలా ఆ ప్రాంతం గురించి నలుగురికీ తెలుస్తుంది. సో.. ఆ ప్రాంతాన్ని శుభ్రంచేయాలన్న ఆలోచన మొదలవుతుందన్నది ఆమె నమ్మకం. నమ్మకమే కాదు.. ఈ ప్లాన్ బాగానే వర్కవుట్ అవుతోందట. స్వచ్ఛ భారత్ కోసం తపిస్తున్న ఇండియాలోనూ ఇలాంటి ఫోటోగ్రాఫర్ ఉంటే బాగు. మన హీరోయిన్లు, ఫోటో గ్రాఫర్లు కూడా ఇలాంటి ఐడియాలతో ముందుకెళ్తే స్వచ్ఛభారత్ కల కొంతైనా నెరవేరుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: