నూతన సంవత్సర వేడుకల రాత్రి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45లో ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌లో ప్రదీప్‌ పట్టుబడ్డాడు. అతడు అధిక మోతాదులో మద్యం తాగినట్టు (178ఎంజీ/100ఎంల్‌) పరీక్షలో తేలింది.అప్పటికప్పుడు ప్రదీప్‌ వాహనాన్ని సీజ్‌ చేసిన పోలీసులు.. బేగంపేట ట్రాఫిక్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌లో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని చెప్పి వదిలేశారు. మరో కారు ద్వారా అక్కడి నుంచి వెళ్లి పోయిన ప్రదీప్‌ సోమ, మంగళవారాల్లో కౌన్సెలింగ్‌కు హాజరవుతాడని పోలీసులు భావించారు కానీ ప్రదీప్ కౌన్స్‌లింగ్‌కు హజరుకాకపోవడంతో ప్రదీప్‌పై ఎన్నో పుకార్లు  వచ్చాయి.
Image result for యాంకర్ ప్రదీప్
దీనిపై స్పందించిన యాంకర్ ప్రదీప్ తాను ఎక్కడికీ పోలేదని..కొన్ని కమిట్ అయిన షూటింగ్స్ ఉండటం వల్ల కౌన్సిలింగ్ కి హాజరు కాలేక పోయానని త్వరలోనే పోలీసుల ఎదుట హాజరవుతానని ప్రకటించాడు.  డ్రంకన్ డ్రైవ్ విషయంలో చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు ఉంటాయో వాటంన్నిటినీ స్వీకరిస్తానని ఆయన అన్నారు. అంతే కాక డ్రంకన్ డ్రైవ్ మీద గతంలో ఓ వీడియో చేశానని దానిని ఉల్లంఘించినందుకు క్షమించండి అంటూ ప్రేక్షులను ఆయన కోరారు.

అంతేకాక నేను చేసిన తప్పు ఎవరూ చేయకూడదని  అన్నారు. కాగా, సోషల్ మీడియాలో ప్రదీప్ అభిమాని ఒకరు... "సార్ మా యాంకర్ ప్రదీప్ ని ఒగ్గేయండి పాపం చిన్నపిల్లోడు తెలిక చేసేశాడు.." అంటూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు చేసిన పోస్ట్‌కు కామెంట్ పెట్టారు.   
Image result for యాంకర్ ప్రదీప్
ఆ కామెంట్‌కు స్పందించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది  దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.. "ఎవరినీ కించపరచడం లేదు.. చిన్నపిల్లోడు అయితే పాలు తాగాలి కాని మందు తాగి నడపడం కరెక్ట్ కాదు కదా? సెలబ్రిటీస్ అందరికీ ఆదర్శంగా ఉండాలి.. అడ్మిన్ హెచ్" అంటూ ఆ అభిమాని కామెంట్‌కు కౌంటర్ ఇచ్చారు.

సార్.. మా యాంకర్ ప్రదీప్ చిన్నపిల్లోడు వదిలేయండి!


మరింత సమాచారం తెలుసుకోండి: