సచిన్ టెండూల్కర్.. పేరు తెలియని ప్రపంచముండదేమో.! వరల్డ్ నెంబర్ వన్ క్రికెటర్ గా పేరెందాడు. ఆయనకానీ, ఆయన కుటుంబసభ్యులుకానీ ఎక్కడికెళ్లినా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. కానీ.. సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కు బెదిరింపులొచ్చాయి. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు..

 Image result for sachin daughter

సచిని కుమార్తె సారా టెండూల్కర్ ను కిడ్నాప్ చేస్తానంటూ వచ్చిన కాల్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. గతనెలలో సచిన్ ఇంటి నెంబర్ కు ఓ కాల్ వచ్చింది. సారాను కిడ్నాప్ చేస్తానని, పెళ్లి చేసుకుంటాననేది ఆ కాల్ సారాంశం. దీనిపై అప్రమత్తమైన సచిన్ ఫ్యామిలీ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాల్ నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు.

 Related image

పశ్చిమ బెంగాల్ లోని మిద్నాపూర్ నుంచి ఆ కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దేవ్ కుమార్ మిత్తి అనే 32 ఏళ్ల వ్యక్తి ఆ కాల్ చేసినట్లు నిర్ధారించుకుని అతణ్ణి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా అతని మాటతీరులో ఏమాత్రం మార్పు లేదు. నిజంగానే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. ఆమెను ఎన్నోసార్లు టీవీలో చూశానని.. అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని తేల్చిచెప్పాడు. దీంతో పోలీసులు షాక్ కు గురయ్యారు.

 Image result for sara tendulkar

సాధారణంగా చుట్టుపక్కల ఉన్నవాళ్ళకో తెలిసినవాళ్లకో ఇలాంటి ఫోన్లు రావడం చాలా కామన్. ఎక్కడో పశ్చిమ బెంగాల్ లో ఉండే వ్యక్తి ముంబైలో ఉండే సచిన్ ఇంటి నెంబర్ కనుక్కొని ఫోన్ చేయడం.. అది కూడా సారాను పెళ్లి చేసుకుంటానని చెప్పడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: