హైదరాబాద్ లో తాగుబోతుల ఆగడాలకు అమాయక ప్రాణాలు బలవుతున్నాయి. ఉన్నాయి. పంజాగుట్టలో చిన్నారి రమ్య కుటుంబం విషాదంతో...హైదరాబాద్ పోలీసులు మందు బాబులపై కఠిన చర్యలు చేపడుతున్నారు. అయినా నగరంలో నిత్యం ఏదో ఓ మూల తాగుబోతుల మితిమీరిన ఆడగాలకు అమాయక ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. అభం శుభం తెలియని అమాకులు ప్రాణాలంటే తాగుబోతులకు లెక్కలేకుండా పోతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లు, కౌన్సిలింగ్ లు, జైలు శిక్షలు, జరిమానాలు, చివరికి లైసెన్స్ రద్దు.. ఇలా ఎన్ని చర్యలు చేపట్టినా తాగి డ్రైవింగ్ చేయటం మాత్రం మానటం లేదు. అర్ధరాత్రి సమయంలో పీకలదాకా తాగి మత్తెక్కిన మైకంలో రోడ్డుపై వేగంగా దూసుకోచ్చి అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నారు.
బంజారా హిల్స్ రోడ్ నెం:10, అర్ధరాత్రి సమయంలో.. మస్తానీ అలియాస్ ప్రియా తో పాటు అనూష, అనూష రెడ్డి అనే ముగ్గురరు స్నేహితురాళ్లు తమ స్నేహితుల కోసం వేచి చూస్తున్నారు. ఇంతలోనే వేగంగా వచ్చిన దూసుకొచ్చిన కారు వీరి ముగ్గురిని ఢికొట్టింది. ఈ కారు నడిపిన వ్యక్తి పీకలదాక తాగి ఉన్నాడు. కారు వేగానికి మస్తానీ అక్కడిక్కడే ప్రాణాలు కొల్పోయింది. మస్తాని స్నేహితురాళ్లైన అనూషరెడ్డి, అనూష కూడా ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో అనూషరెడ్డి కోమాలోకి వెళ్లగా అనూష స్వల్ప గాయలతో బయటపడింది. అప్పటిదాకా కలిసి కబుర్లు చెపుకుంటున్న స్నేహితుల మద్యకు మృత్యువు తాగుబోతు రూపంలో దూసుకొచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన కొద్దిమంది సాప్ట్ వేర్ ఉద్యోగులు వీరిని అపోలో హస్పిటల్ కు తరలించారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరగిపోయింది.
ఏ పాపం చేయకున్నా. తమ తప్పేమి లేకున్నా తాగుబోతుల ఆగడాలకు అభం శుభం తెలియని సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ముగ్గురుని ఢికొట్టిన కారును డ్రైవ్ చేసింది విష్ణు వర్ధన్ అనే వ్యక్తి చూసేందుకు సూటు బూటు వేసుకుని జెంటిల్ మెన్ లా కనిపిస్తున్నా... ఈ తాగుబోతు మూలంగా ఒక ప్రాణం గాలిలో కలసిపోయింది. మరోకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంకోకరు గాయాలపాలయ్యారు. చనిపోయిన మస్తానీ అలియాస్ ప్రియా 5 నెలలుగా నగరంలో ఉంటుంది.
ఏ పాపం చేయకున్నా, తమ తప్పేమి లేకున్నా తాగుబోతుల ఆగడాలకు అయాకుల ప్రాణాలు గాలిలో దీపాలు అవుతున్నాయి. ఇలాంటి తాగుబోతులను రోడ్లపై అడుగు పెట్టనీయకుండా కఠిన చర్యలు తీసుకుంటే తప్పా ఈ మారణహోమాలు ఆగేలా లేవు.. వారి ఆనందం కోసం, కిక్కు కోసం పీకల దాకా తాగి మత్తులోకంలో విహరిస్తూ తాము ఏంచేస్తున్నామో ఎలా చేస్తున్నామో తెలియకుండా రోడ్లపై అడ్డదిడ్డంగా డ్రైవింగ్ చేస్తూ ఇతరుల ప్రాణాలు బలితీసుకుంటున్న ఇలాంటి వారికి శాశ్వత శిక్షలు విధిస్తే కానీ మిగిలిన వారిలో అయినా ఎంతో కొంత మార్పు వస్తుందేమో..!