జనగామలో పట్టుకోసం ఇద్దరు మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారా...? ఇప్పటికే పార్టీలో రెండు వర్గాలుగా ఉన్న వీరు వచ్చే ఎన్నికల కోసం ఎవరి అభ్యర్థి ని వారు రంగంలో కి దింపుతున్నారా..?  వీరిద్దరి వ్యవహారం ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఎసరు పెడుతుందా...? అంటే కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే నిజమేనని పలువురు నేతలు గుసగుసలాడుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతుండడంతో  రాజకీయంగా ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.
Image result for telangana
కొద్ది రోజుల క్రితం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డితో మంత్రి హరీశ్ రావు ను కలిసి సంప్రదింపులు జరిపడం కూడా ఈ వాదనకు బలాన్నిస్తోంది. కొమ్మూరి స్వగ్రామం పాత చేర్యాల నియోజకవర్గ పరిధిలోని మద్దూరు మండలం నర్సాయపల్లి. ఆయన నర్మెట జడ్పీటీసీ గా పనిచేశారు.
నిజానికి టీఆర్ఎస్ పార్టీకి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టిన వారిలో ఆయనొకరని ప్రచారం. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి చేర్యాలలో గెలిచారు. ఆ తర్వాత 2008 ఉప ఎన్నికల్లో కూడా ఆయన గెలిచారు.

2009 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. అనంతరం టీఆర్ఎస్ లో చోటుచేసుకున్న పరిణామాలతో ఆయన బీజేపీలో చేశారు. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో చేర్యాల నియోజకవర్గం తొలగించడంతో గత ఎన్నికల్లో జనగామలో బీజేపీ నుంచి బరిలో నిలిచి ఓడిపోయారు. అయితే జిల్లాల పునర్విభజనలో చేర్యాల సిద్దిపేటలో కలిసింది. నియోజకవర్గం మాత్రం జనగామనే. ఇప్పుడాయన మంత్రి హరీశ్ రావు హామీతోనే టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు సమాచారం. అయితే జనగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత ఉండడం, ఈసారి ఆయనకు టికెట్ రాదన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు ప్రజల్లో ఆసక్తిని రేపుతున్నాయి.


మరోవైపు మంత్రి కేటీఆర్ అండతో జనగామలో వంశీధర్ రెడ్డి కూడా రంగంలోకి దిగడం గమనార్హం. అమెరికాలోనే కేటీఆర్, వంశీధర్ రెెడ్డి మంచి స్నేహితులని, ఆటాలో సభ్యులుగా మంచి సంబంధాలు  ఉన్నాయని వంశీధర్ అనుచరులు చెబుతున్నాారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మొదట్లో సీఎం కేసీఆర్ తో మంచి సంబంధాలు ఉండేవి. మొదటి నుంచి పార్టీ కార్యక్రమాల నిర్వహణకు పెద్దమొత్తంలో డబ్బు ఇచ్చిన వారిలో ఈయనొకరని చెబుతారు. అయితే పలు వివాదాలతో ఆయనకు కేసీఆర్ తో సంబంధాలు దెబ్బతిన్నాయి. 


ప్రధానంగా హైదరాబాదులో భూముల వ్యవహారం, జనగామలో బతుకమ్మ కుంట ఆక్రమణ ఆరోపణలు, రిజర్వేషన్ల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు ఆయనను పార్టీ లో ఒంటరిని చేశాయని అనుచరులు అంటున్నారు. అయితే కొద్ది రోజులుగా ముత్తిరెడ్డి మంత్రి హరీశ్ రావుకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయనను అటు కేటీఆర్ గానీ ఇటు హరీశ్ గానీ దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఈనేపథ్యంలో సిద్దిపేటకు దగ్గరగా ఉన్న జనగామలో ఎలాగైనా పట్టు సాధించేందుకు మంచి పేరున్న కొమ్మూరిని రంగంలో కి దింపుతున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ఆధిపత్య రాజకీయంలో అసలు టికెట్ ఎవరికి వస్తుందోనని తెలంగాణ లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: