ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందిస్తూ బిల్ గేట్స్ లేఖ రాశారు. వ్యవసాయం -పౌష్టికాహారం, ఆరోగ్య రంగాల సమ్మిళిత చేసి ప్రణాళిక రూపొందించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు. ఏపీ సర్కారు నవంబర్ నెలలో విశాఖలో అగ్రీటెక్ సమ్మిట్ 2017ను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో పాల్గొన్న బిల్ గేట్స్ తన అనుభవాలను నెమరేసుకుంటూ చంద్రబాబును ప్రశంసిస్తూ ప్రత్యేకంగా లేఖ రాశారు. 

chandrababu naidu with bill gates కోసం చిత్ర ఫలితం

చంద్రబాబు పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించిన బిల్ గేట్స్.. ఏపీకి పూర్తి సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 85శాం మందికి ఆరోగ్య భీమాను ప్రభుత్వం కల్పించటం పట్ల హర్షం వ్యక్తం చేసిన బిల్ గేట్స్  దీని  నిర్వహణ పట్ల సీఎంకు అభినందనలు తెలిపారు. వ్యవసాయ రంగానికి సాంకేతికత జోడించటం, భూ సార పరీక్షల మ్యాపింగ్  విలువ జోడింపు చెయిన్ల ఏర్పాటు తదితర అంశాల పై కలిసి పనిచేద్దామని బిల్ గేట్స్ లేఖలో ప్రతిపాదించారు.

chandrababu naidu with bill gates కోసం చిత్ర ఫలితం


ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ విధానాలను అందించేందుకు ప్రయత్నిస్తానని లేఖలో పేర్కొన్నారు. అభివృద్ధిలో ఏపీ మిగతా ప్రపంచానికి ఆదర్శంగా ఉండేలా రూపుదిద్దుకుంటుందని బిల్ గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఈ లేఖ రాయడం టీడీపీ వర్గాల్లో ఆనందం నింపుతోంది. చంద్రబాబు కష్టానికి తగిన గుర్తింపు దొరుకుతోందని ఆనందిస్తున్నారు. దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి.. పార్టీ మైలేజీ పెంచుకునే ప్రయత్నాల్లో పడ్డారు. 


chandrababu naidu with bill gates కోసం చిత్ర ఫలితం
ఐతే.. ఇందులో అంతగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదని వైసీపీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. ఏదైనా సదస్సు జరిగినప్పడు ఆ తర్వాత ఇలాంటి ఉత్తరాలు రాయడం సాంప్రదాయమని.. ఇదేదో బ్రహ్మాండం బద్దలవడం కాదని చెప్పుకొస్తున్నారు. టీడీపీ నేతలు మాత్రం.. అప్పట్లో హైద‌రాబాద్‌ను ఐటీ రంగంలో ప్ర‌పంచ‌దేశాల్లోని టాప్ న‌గ‌రాల స‌ర‌సన చేర్చిన చంద్ర‌బాబు ఇప్పుడు న‌వ్యాంధ్ర‌ను ప్ర‌పంచ ప‌టంలో నిలిపేందుకు చేస్తున్న కృషికి బిల్ గేట్స్ అంత‌టి వ్య‌క్తి లేఖ రాయ‌డం కచ్చితంగా గొప్ప విషయమే అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: