ఏపీ మంత్రి నారా లోకేశ్ .. పుట్టుకతోనే బంగారు చెంచా నోట్లో పెట్టుకుని పుట్టిన వ్యక్తి.. తాను పుట్టే సమయానికే తాత ముఖ్యమంత్రి... ఆ తర్వాత కాలంలో తండ్రి ముఖ్యమంత్రి.. ఇక పిల్లనిచ్చిన మామ.. సినిమా ఇండస్ట్రీలో పెద్ద స్టార్.. కుటుంబమంతా సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్నవారే. ఇలా ఇంట్లో అంతా ప్రముఖులే. మరి ఇలాంటి వ్యక్తికి కష్టం అంటో ఏంటో తెలియడం కష్టమే కదా.

nara lokesh with narayana కోసం చిత్ర ఫలితం
కానీ ఇన్నాళ్లకు నారా లోకేశ్ కష్టం అంటే ఏంటో తెలిసొచ్చిందట. ఏ విషయంలో అంటారా.. హైదరాబాద్ లో నిర్మిస్తున్న ఇంటి విషయంలో అన్ని విషయాలు నారా లోకేశ్ చూసుకుంటున్నారట. దాంతో వామ్మో ఇల్లు కట్టాలంటే ఇంత కష్టం ఉంటుందా అనిపించిందట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన నెల్లూరు పర్యటనలో చెప్పుకొచ్చారు. 
తాను ఒక్క ఇంటి నిర్మాణానికి ఇంత కష్టపడ్డానని.. కానీ మంత్రి నారాయణ వేల ఇల్లు అలవోకగా కట్టిస్తున్నారని ప్రశంసలు కురిపించారు.

nara lokesh with narayana కోసం చిత్ర ఫలితం
జన్మభూమి మా ఊరు కార్యక్రమం కోసం నెల్లూరు జిల్లాలో పర్యటించిన లోకేశ్.. నెల్లూరు నగరంలోని జనార్ధనరెడ్డి కాలనీలో నిర్మాణంలో ఉన్న పేదల ఇళ్ళ కాలనీని ఆయన పరిశీలించారు. ఒకే ప్రాంతంలో 4300ఇళ్లు నిర్మాణం చేయడం, అందులోనూ అదునాతన టెక్నాలజీతో నిర్మిస్తున్న ఇళ్ళను చూసి లోకేశ్ ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రి ఏదైనా మాట చెబితే దాన్ని నారాయణ తూచ తప్పకుండా అమలు పరుస్తారని లోకేశ్ మెచ్చుకున్నారు. 

nara lokesh with narayana కోసం చిత్ర ఫలితం
మంత్రి నారాయణ తమకన్నా వేగంగా అభివృద్ధి పనులు పోటీపడి పూర్తిచేస్తున్నారని నారా లోకేశ్ అన్నారు. మంత్రివర్గంలో తనకు నారాయణ వంటి ఇద్దరు ముగ్గురు పనిమంతులతో పోటీ ఉంటోందని చెప్పుకొచ్చారు. నారాయణ కన్నా వేగంగా పనిచేసేందుకు తాను సిన్సియర్ గా ప్రయత్నిస్తున్నానని లోకేశ్ అన్నారు. అందుకే.. సకల సౌకర్యాలు ఉన్నా.. స్వయంశక్తితో ఎదిగితే.. అందులో ఉండే ఆనందమే వేరు.  



మరింత సమాచారం తెలుసుకోండి: