ఒక కొత్త జాతీయపార్టి జాతికి ఇప్పుడు అవసరం. బాజపా తప్ప మిగిలిన భారతీయ రాజకీయపార్టీలన్నీ వారసత్వాల నుండి వచ్చే నాయకత్వాలతో విలసిల్లుతున్నాయి. బహుశ భారత్ లో నూతనవ్యక్తులు రాజకీయాల్లోకి వస్తున్నదాఖలాలు కనిపించ టం లేదు. ఉదాహరణకు కలవకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణా ముఖ్యమంత్రి ఆయన వారసులు కలవకుంట్ల తారక రామారావు కూతురు కవిత మేనల్లుడు తన్నీరు హారీష్ రావు వరుసగా రాజకీయాల్లో తమ స్థానాలను స్థిరం చేసుకుంటున్నారు. ఆ తరవాత వారి కొడుకులు కోడళ్ళు రాజకీయాల్లోకి వచ్చి పరోక్షంగా "రాజరికం" నడిపిస్తున్నారు.

Related image

రాజకీయాల్లో ప్రజా శ్రేయస్సు కోసం కొత్త పోకడలు రావలసిన అవసరముంది. స్వాతంత్రం వచ్చిన రోజుల్లో నీతి, నిజాయతీ, ఋజువర్తన ఉన్న నాయకులే జాతికి నాయకత్వం వహించినా వారసత్వానికి బీజాలు వేసింది మాత్రం మోతీలాల్ నెహౄ. మహాత్మా గాంధికి ప్రజల్లో ఉన్న సానుకూలతను నెహౄ కుటుంబం తనకు అవకాశంగా మార్చుకొని "ఇంతింతై వటుడింతై" అన్నట్లుగానే తమ కుటుంబానికి "రాజరికం" సాధించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం నెహౄ పడగనీడలోనే కాలం గడుపు తూ వస్తుంది. చివరికి రాహుల్ గాంధి అసమర్ధుడు అనుకున్న సమయంలోనూ ఆయన నాయకత్వం కోసం పాకులాడింది. చివరకు ప్రియాంకా గాంధి వాధ్రా అయినా నాయకత్వం వహిస్తే బాగుండునని 'టాప్ టు బాటం కాంగ్రెస్' సర్వస్వం భావించింది. అసలు కాంగ్రెస్ అంటేనే బానిసత్వానికి చిహ్నం.

Image result for motilal jawaharlal indira rajiv sonia rahul

తెలుగువాళ్ళకి బానిసత్వం నుండి ఆత్మ గౌరవ సిద్ధాంతం తో విముక్తి కలిగించింది నందమూరి తారక రామారావు మాత్రమే. అయితే ఆ తరవాత ఆయన తన స్వయంకృతాపరాధం తోనే తన అల్లుడు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుణి నాయకత్వంలో రాజకీయ వెన్నుపోటుగురై తన అధికారానికి చరమ గీతం పాడుకొన్నా, చంద్రబాబుని నాయకునిగా అంగీకరించటం మాత్రం వారసత్వమే ప్రధాన కారణం ఎందుకంటే నాడు ఎంటిఆర్ కుటుంబంలో అధికారం నిర్వహించగల సమర్ధులెవరూ లేరు కాబట్టి చంద్రబాబు చెట్టు నీడలో ఈ కుక్కమూతిపిందెలన్నీ ఒకటై తెలుగుదేశం పార్టీలో అధికారంలోకి రావటం జరిగింది. నెహౄ కుటుంబ అధికారం బానిసలైన కాంగ్రెస్ తెలుగు ప్రజలు ఎంటిఆర్ లేకపోయినా ఆయన కుటుంబ వారసుల ఆద్వర్యంలోని తెలుగు దేశం పార్టీ కి బానిసలై బతుకీడుస్తున్నారు. ఈ విషస్ సర్కిల్ బ్రేక్ చేసిన తరవాత తెలంగాణాలో మాత్రం కెసిఆర్ కుటుంబానికి బానిసలయ్యారు నైజాం ప్రజలు.

Image result for motilal jawaharlal indira rajiv sonia rahul

అసలు పని చేసే వాళ్ళకు ఓటేసే సంస్కృతి మనం అలవరచుకుంటే ఈ రాజకీయాలు వ్యాపారంగా మారకుండా ఉండేవి. జాతి సంపదంతా ఈ రాజకీయ వ్యాపారుల చేతిలోకి పూర్తిగా వెళ్ళిపోయింది. అందుకే తమిళనాట టిటివి దినకరన్ ఓటొక్కింటికి ₹20000/- ఖర్చు బెట్టి ఎన్నికల్లో గెలిచినట్లు అన్నీ రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఇలా ధనం ప్రవహింపజేసేది వ్యాపారులు తప్ప నిజమైన సేవా దృక్ప్రధమున్న రాజకీయ నాయకులు కారు. అందుకే ఈ కుటుంబ వారసులుగా రాజకీయాల్లోకి వచ్చేవాళ్లంతా కుహానా రాజకీయ నాయకులే. ప్రతి ఒక్క రాజకీయనాయకునికి రాజకీయ వ్యాపార ప్రయోజనాలుండబట్టే ఈ దిక్కుమాలిన అరాచకాలు నడుస్తున్నాయి. అవే లేకుంటే ప్రజలు ఎన్నికల్లో తమను ఎన్నుకోలేదు కదా అంటూ తమ స్వంత వ్యాపకాల వైపుకు మరలిపోతారు.

Image result for Sr ntr chandrababu lokesh

ఇలా వారసులు రాజకీయాధికారం చిక్కించుకొంటూ పోతూఉంటే దేశంలో వారి రాజకీయ వ్యతిరేఖులకు, తటస్థులకున్యాయం జరగటం అటుంచి వారి వృత్తిగత వ్యక్తిగత జీవితాలు నిర్వీర్యమై పోవటం తధ్యం.

Image result for Sr ntr chandrababu lokesh

ఉదాహరణకు తన బావమరది, వియ్యంకుడు, ఎమెలే నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణికి వినోదపన్ను రద్ధుచేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు చరిత్రనే అధారం చేసుకొని నిర్మించిన రుద్రమదేవి సినిమాకు ఆ ఏర్పాటు ఇవ్వకపోవటం ఆ సినిమా నిర్మాత దర్శకుడు గుణశేఖర్ తన కులంవాడు, తన పార్టీవాడు, తన బంధువు కాకపోవటమేది సిగ్గు పడాల్సిన విషయం.

Image result for Sr ntr chandrababu lokesh

అఫ్త్రాల్ ఒక సినిమాకు వినోద పన్ను రద్ధు చేస్తే వచ్చే చిన్న ప్రయోజనానం కోసం కక్కుర్తి పడ్ద నాయకత్వం పెద్ద పెద్ద ప్రోజెక్ట్ కాంట్రాక్టులకోసం లాలు ప్రసాద్ యాదవ్ పశువుల గడ్డి మేసినట్లు గడ్డిమేయరా? అలానే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తెలంగాణా వాసుల నోట్లోను మట్టి కొట్టింది తెరాస. పదవులు మొత్తం ఒకే ఒక్క నాయకుని కుటుంబానికి దారాదత్తం చేస్తూ ఆ తరవాత నలుగురు కుటుంబ సభ్యులకు పంపకాలు చేసేసుకున్నారు.   

Image result for KCR family in to politics in telangana

ఇలా వారసులు తన వాళ్ళు అంటూ వారికే ఆయాచిత వరాలు అనుచిత వరాలు ఇస్తూ పోతే ప్రజాస్వామ్యం మరుగున పడి పోతోంది క్రమంగా రాచరికం మళ్ళీ పుంజుకొంటుంది. ధనం అధికారం గుప్పెట్లో పెట్టుకున్న కొందరు మరోసారి దేశాన్ని నడిపిస్తుండగా,  రాజ్యంలో  నియంతృత్వం రెక్కలు విప్పుకుంటొంది అని చెప్పటానికి మన ఉభయ రాష్ట్రాల్లోని అధినేతల కుటుంబాలు చాలు.

Image result for KCR family in to politics in telangana

కాంగ్రెస్ సుమారు ఆరు దశాబ్ధాలు దేశాన్ని పాలించగా దానికి నెహౄ కుటుంబమే నాయకత్వం వహించగా-రాష్ట్రంలోని వారి ప్రతినిధులు అనేకులు వారు వారి వారసులతో అధికారం వెలగబెట్టారు. అలాంటి వారసుల వరుసలో పదవి తనను వరించ లేదని ఏడుస్తూ ఓదార్పు కోసం ఊళ్ళు పట్టి తిరుగుతున్నాడు ఒక నాయకుడు.

Image result for KCR family in to politics in telangana

ఇక  తెలుగు దేశం మూడు దశాబ్ధాలు ఒకే కుటుంబం నాయకత్వం వహించింది. అలాగే అదే దిశ లో తెలంగాణా రాష్ట్ర సమితి కూడా  పయనిస్తుంది కేసిఆర్ కుటుంబ నాయకత్వాన.  నేడు అన్నీ చోట్ల వారికి వారి వారసులకు శాసనసభ స్థానాల కేటాయింపులకై బేరసారాలు సాగిస్తున్నారు అదీ ఒక్క పార్టీలో కాదు నేడు ఉనికిలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ అదే దారిలో పయనిస్తుంది.

Image result for KCR family in to politics in telangana

అందుకే అన్నీ చోట్ల ఇప్పటి వరకు రాజకీయ వాసనలు లేని వ్యాపార పారిశ్రామిక రంగాలకు చెందని వారే అభ్యర్ధులుగా రాజకీయాల్లొకి రావలసిన తరుణం ఆసన్నమైంది. అప్పుడే దురాశ లేని ప్రజలే లక్ష్యంగా రాజనీతిఙ్జులు రాజకీయ రంగంలోకి రానంతవరకు ఈ దేశంలో రాజకీయ కసవు ఊడ్చేసే వరకు స్వచ్చ భారత్ అవ్వలేదు.

Image result for KCR family in to politics in telangana

పవన్ కళ్యాణ్ తన పార్టీకి జన్మ నివ్వకుండానే అధికారంలో ఉన్న ఒక పార్టీకి పూర్తిగా అమ్మేశాడు. దాన్నుంచి ప్రజలు ఆసించేదేమీ ఉండదని అర్ధమైపోయింది. ప్రతి పార్టీకి వెన్నుముఖగా ఒక్కో మీడియా వ్యవస్థ కొన్ని చోట్ల అంతకు మించిన సంఖ్యలోనే అండగా ఉన్నాయి. అందుకే ప్రజలు మీడియాను నమ్మట్లేదు. నమ్మినా కూడా కనీసం ఒక వార్త దృవపరచు కోవటానికి అనేక టెలివిజన్ చానళ్లపై పత్రికలపై ఆధారపడుతున్నారు.

Image result for Sr ntr chandrababu lokesh

వ్యవస్థలు నిర్వీర్య మవక ముందే జనావళి మేలుకోవలసిన అవసరముంది. తమిళనాడులోని ఆర్కే నగర్ నియోజక వర్గంలో లాగా ఓటర్లు ప్రచారం లో ఉన్నట్లు అమ్ముడు పోకపోతే మాత్రం ప్రజాశ్రేయస్సు కోరే వారే పాత రాజకీయ నాయకుల ప్రమేయం లేని కొత్త రాజకీయ పార్టీలను నిర్మించుకోవలసిన అవసరం ఎంతైనాఉంది.         

మరింత సమాచారం తెలుసుకోండి: