దాదాపు ఏడాదిన్నర తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రదానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వీరిద్దరి భేటీ అనేక నూతన రాజకీయ పరిణామాలకు చోటుచేసుకుంటుంది. ఎప్పటినుండో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కి సంబంధించి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల విషయమై అలాగే విభజన హామీల గురించి చర్చిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోప్రధాని మోదీ అపాయింట్ మెంట్ దొరకడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సంతోషించింది ...రాష్ట్రానికి సంబంధించిన కేంద్రం చేయాల్సిన సాయం గురించి, రాజ‌ధాని నిర్మాణం, పోల‌వ‌రం వంటి అంశాల‌తో పాటు ప‌లు స‌మ‌స్య‌ల‌పై కేంద్రం ముందు విన్న‌వించుకోవాల‌నుకుంటున్నారు చంద్ర‌బాబు.

ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా వీటి కోసమే ఎదురుచూస్తున్నాడట చంద్ర‌బాబుకు ఏ హామీల‌యితే ఇచ్చారో త‌మ‌కు కూడా అవే కావాల‌ని, పోల‌వ‌రంతో పాటు కాళేశ్వ‌రంను కూడా జాతీయ ప్రాజెక్ట్‌గా ప్ర‌క‌టించాల‌ని కోరాల‌ని భావిస్తున్నాడ‌ట‌. రాజ‌ధాని నిర్మాణానికి నిధులు ఇస్తే.. త‌మ‌కు కూడా ఎఫ్ఆర్‌బీఎమ్ యాక్ట్‌ని స‌వ‌రించాల‌ని కేంద్రాన్ని డిమాండ్ చేయ‌నున్నాడ‌ట‌. మరి ప్రధాని మోదీ చంద్రబాబు తో ఎలా వ్యవహరిస్తారో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: