సోషల్ మీడియా వచ్చాక.. మనకు తెలిసింది నలుగురికి చెప్పడం ఓ వ్యసనంగా మారిపోయింది. మనం చూసింది నలుగురూ చూడాలన్న యావ కూడా పెరిగిపోయింది. అందుకే ఏదైనా ఓ వార్త ఇంట్రస్టింగ్ గా కనిపించగానే దాన్ని నలుగురికీ షేర్ చేస్తున్నారు. ఇక వాట్సప్ వచ్చాక ఈ షేరింగ్ గోల బాగా ముదిరిపోయింది. గ్రూపుల వారీగా వచ్చిన సందేశాన్ని మరికొందరికి షేర్ చేస్తే కానీ కొందరికి నిద్రపట్టదు. 

WhatsApp will stop working for few phones
ఈ వాట్సప్ గ్రూపుల్లో అనేక రకాలు ఉంటాయి. కాకపోతే.. ఒక గ్రూపులో పోస్ట్ చేయాల్సింది.. వేరే గ్రూపులో పోస్టు చేస్తేనే కొంపలు మనిగిపోతాయి. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో అదే జరిగింది. ఓ టీడీపీ నేత ఓ బూతు వీడియోను మరో గ్రూపులో పోస్ట్ చేశారట. అది కాస్తా వైరల్ అయ్యింది. ఈ పెద్ద మనిషికి ఇదేంపోయే కాలం అంటూ అంతా ఈసడించకుంటున్నారు. 

WHATSAPP కోసం చిత్ర ఫలితం

ఒక్క రాంగ్ పోస్టింగ్ తో పరువు కాస్తా పోయే పరిస్థితి ఎదురైంది. ఇంతకీ ఆ నాయకుడు ఎవరా అనుకుంటున్నారా.. పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ కోరిపూరి రాజు. అయితే ఆయన వివరణ మరోలా ఉంది. అది తాను పోస్టు చేయలేదని.. తన పిల్లలు పొరపాటు దానిని పోస్టు చేశారని ఆయన చెప్పుకుంటున్నారు. మొత్తానికి రాజు చర్య వల్ల పార్టీ పరువు పోయిందంటున్నారు టీడీపీ నేతలు. 

WHATSAPP కోసం చిత్ర ఫలితం

ఈ అంశాన్ని ఆయన వ్యతిరేకులు బాగా ఉపయోగించుకునే పనిలో ఉన్నారు. ఆయనపై చర్య తీసుకోవాలని కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు కూడా. పార్టీ నాయకత్వం కూడా దీనిపై ఆగ్రహంగా ఉందని కథనాలు వస్తున్నాయి. అందుకే వాట్సప్ , ఫేస్ బుక్ లతో జాగ్రత్తగా ఉండాలండోయ్.. తెలిసీ తెలియక ఏదో ఒక కీ నొక్కామంటే ఇక కావాలసినంత డ్యామేజ్ జరిగిపోతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: