భారత దేశంలో ఇప్పుడు ఉష్ణోగ్రత చాలా వరకు పడిపోయింది..చలికాలం కావడంతో ఎక్కడ చూసినా మంచు కప్పేసి ఉంటుంది.  ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో చలితో వణికిపోతున్నారు. అయితే చలికాలంలో ప్రతిఒక్కరికీ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి..ఉదయం లేవాలంటే..ఏ పనైనా మొదలు పెట్టాలంటే చాలా బద్దకంగా ఉంటుంది.  వెచ్చగా కాసేపు సేద తీరాలని దుప్పట్లు, రగ్గులు కప్పుకొని పడుకుంటాం. ఇక స్నానం చేయాలంటే వణుకు మొదలవుతుంది..దాంతో హిటర్, గ్యాస్ పై కానీ వేడి నీళ్లు కాచుకొని స్నానాలు చేస్తుంటాం. 
Image result for winter  India
అయితే సాధారణంగా చలి తీవ్రతకు కొన్ని వస్తువులు గడ్డ కట్టడం చూస్తుంటాం. ముఖ్యంగా కొన్ని వాహనాలు చలికాలంలో బాగా మొరాయిస్తుంటాయి.  తాజాగా చలికాలం ఇబ్బందులు మనుషులకే కాదు..వాటికి కూడా ఉంటాయని అంటున్నారు..  హిమాచల్‌ప్రదేశ్‌లోని బ్యాంకు అధికారులు. ఇంతకీ ఏంటా అవి అనుకుంటున్నారా..మనం ఇప్పుడు నిత్యం వాడే ‘ఏటీఎం’లు అవును..ఇక్కడ ఏటీఎం లకు కూడా బాగా చలిపెడుతుందట..దాంతో వాటిని వెచ్చగా ఉంచేందుకు రగ్గులు కప్పుతున్నారు.
Image result for winter  India
అక్కడితో ఆగడం లేదు.. మరింత వెచ్చగా ఉంచేందుకు హీటర్లు కూడా పెడుతున్నారు. వింటానికి ఇది విచిత్రంగా ఉన్నా..వాస్తవం. రాష్ట్రంలోని లాహుల్-స్పిటి జిల్లాలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. మైనస్ డిగ్రీలకు చేరుకోవడంతో ఏటీఎంలు జామ్ అయిపోతున్నాయి. దీంతో డబ్బులు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని అధికారులు...మనుషులు తీసుకుంటున్న జాగ్రత్తలే వీటికి కల్పిస్తే ఎలా ఉంటుందని భావించారు. 
Image result for himachal pradesh atm htaters
బ్యాంకు అధికారులు ఏటీఎం కేంద్రాల్లో హీటర్లు పెట్టడంతోపాటు రగ్గులు కూడా కప్పుతున్నారు. జిల్లాలోని కేలాంగ్ ప్రాంతంలోని ఏటీఎంలు ఇప్పుడు రగ్గులతో దర్శనమిస్తున్నాయి. లాహుల్-స్పిటిలో ఉష్ణోగ్రతలు మైనస్ 25 డిగ్రీల సెల్సియస్ డిగ్రీలకు పడిపోయాయి. దీంతో ఏటీఎంలు పనిచేయడం మానేశాయి. అంతేకాదు.. యంత్రాలు పాడైపోతుండడంతో స్పందించిన అధికారులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. గదిని వెచ్చగా ఉంచేందుకు హీటర్లు పెడుతున్నామని అధికారులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: