హైదరాబాద్ నగరవాసులకు హెచ్చరిక. మహారాష్ట్రకు చెందిన చెడ్డీ గ్యాంగ్ ఒకటి నగరంలో సంచరిస్తుంది. ఇటీవల కూకట్‌పల్లి, మియాపూర్‌ ప్రాంతాల్లో చోరీలు పెరగడంతో పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫూటేజీలను పరిశీలించారు.   దోపిడి దొంగతనాలకు పాల్పడుతూ అడ్డువచ్చే వారిని అంతమొందిచడానికి సైతంవెనుకాడని చెడ్డీ గ్యాంగ్‌ దొంగల ముఠా కదలికలు రాచకొండ పోలీసు కమిషనరేట్‌లోని  పోలీసులు అప్రమత్తం అయ్యారు.

రాత్రివేళ్లలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానస్పదంగా సంచరిస్తున్నట్లు  తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని తెలుపుతున్నారు. రాత్రివేళ్లలో అలికిడి ఏర్పడినప్పుడు వెంటనే తలుపులు తెరవద్దని సూచిస్తున్నారు. అయితే కొన్ని రోజులు గా ఈ గ్యాంగ్ ఇతర రాష్ట్రాలకు వెళ్లిందని వార్తలు వినిపించాయి. తాజాగా నగరంలో  చెడ్డీ గ్యాంగ్‌ మళ్ళీ హల్‌చల్‌ చేస్తోంది. మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హస్తినాపురం అగ్రకల్చర్‌ కాలనీలో బుధవారం వేకువజామున ఎనిమిది మంది చెడ్డీ గ్యాంగ్‌ ముఠా వీరంగం సృష్టించారు.
చెడ్డీ గ్యాంగ్ దోపిడీలు
ఏపీ09 సీపీ 4061 నంబర్‌ గల వాహనంలో వచ్చిన ముఠా బ్లూమింగ్‌ డాల్‌ అపార్టుమెంట్‌లోకి జోరబడి వాచ్‌మన్‌ను కట్టేశారు, అనంతరం లోనికి ప్రవేశించి ఎనిమిది ఫ్లాట్లకు బయటి నుంచి గడియ పెట్టారు.   చంద్రమోహన్‌రెడ్డికి చెందిన అపార్టుమెంట్‌లోకి ప్రవేశించి 11 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్ళారు. ఆ సమయంలో ఇంటి యజమాని ఇంట్లో లేరు. పనిమీద పొరుగూరికి వెళ్ళారు. కాగా, ఆయన పిల్లలు అమెరికాలో ఉంటున్నారు.
కేకలు వేయడంతో..
అపార్ల్‌మెంట్‌లో చెడ్డీ గ్యాంగ్ అలజడితో ఇరుగుపొరుగు అపార్టుమెంట్‌లలోని వారు లేచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, బయటి నుంచి గడియ పెట్టడంతో తలుపులు తెరుచుకోలేదు. దీంతో గట్టిగా కేకలు పెట్టారు. ఆ కేకలు విన్న సమీపంలోని ప్రజలు రావడంతో చెడ్డీగ్యాంగ్‌ ముఠా అక్కడ్నుంచి పరారైంది.  విషయం తెలుసుకున్న ఎల్‌బీ నగర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు సిబ్బందితో చోరీ జరిగిన అపార్టుమెంట్‌ను పరిశీలించారు. వేలి ముద్రలు సేకరించారు. చెడ్డీగ్యాంగ్‌ ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఘటనా స్థలానికి డీసీపీ..

చెడ్డీ గ్యాంగ్‌ ఇలా ఉంటారు :
ఈ గ్యాంగ్‌లో ఐదు, ఆరు లేదా ఎనిమిది, పది మంది సభ్యులు ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గ్యాంగ్‌ అర్థరాత్రి సమాయాల్లో ఒంటరిగా వెళ్లే వారిని, ఏకాంతగా ఉండే ఇళ్లను లక్ష్యంగా పెట్టుకున్నారు. చెడ్డీలు, బనీయన్లు ధరించి ముఖాలకు ముసుగులు ధరిస్తారు. అవసరమైతే మారణాయుదాలతో దాడి కూడా చేస్తారని అంటున్నారు.   శరీరానికి ఒండ్రుమట్టీ లేదా నూనే రాసుకొని సంచరిస్తారు. పగలు కుడ్తా, లుంగీలు ధరించి సాధరణంగా తిరిగే వీరు రైల్వే, బస్టాండులలో, కాలనీల్లో ఖాళీగా ఉండే ప్లాట్లలో బస చేస్తారు. ఉదయం ఖాళీగా ఉన్న ఇళ్లు పరిశీలించి దొంగతనాలకు పక్కా ప్లాన్ వేస్తారని పోలీసులు అంటున్నారు.
ప్రజలు తీసుకోవాల్సి జాగ్రత్తలు :
అనుమానిత వ్యక్తులు గ్రామాలలో సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. కాలనిలలో సీసీటీవిలు ఏర్పాటు చేసే విధంగా అవగాహణ కల్పించాలి. గస్తీకి వెళ్ళేటప్పుడు పోలీసులు సైతం ఆయుదాలు తీసుకెళ్ళడంతో పాటు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: