ఏ పదవిలో ఉన్నా.. ఏ పరిస్థితుల్లో ఉన్నా అప్పుడప్పుడూ మనలోని అసలు రూపం బయటపడుతుంది. ఎవరూ చూడటం లేదులే అన్నప్పుడు ఆ అసలు వ్యక్తి తొంగిచూస్తాడు.. అది ఏమంత గౌరవప్రదమైనదే కావచ్చు..కానీ.. తమాయించుకోవడం ఆ సమయంలో కష్టం. సాక్షాత్తూ ముఖ్యమంత్రితో పాటు అతిధులుగా వెళ్లిన కొందరు జర్నలిస్టులు చేసిన పని చూస్తే మీరు ఈ విషయం ఒప్పుకుని తీరతారు. అసలేమైందేంటే.. 

silver spoon కోసం చిత్ర ఫలితం

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తూ... తనకు ఆత్మీయులైన మీడియా సంపాదకుల బృందాన్ని తీసుకుని వెళ్ళారు. లండన్ లో మమతా గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేసారు. అక్కడ వెండి పళ్ళాలు, చెంచాలు చూసి మన బొంగాళీ జర్నలిస్టుల కళ్ళు చెదిరాయి. ఎడిటర్లలో పెద్దాయన ఒకడు మొదట ఒక చెంచా తీసి జేబులో పెట్టుకున్నాడు. ఇంకేముంది... మిగతా వాళ్ళు కూడా వరస కట్టారు. క్షణాల్లో అక్కడి వెండి చెంచాలు గాయబ్.

సంబంధిత చిత్రం

వారికి తెలీని విషయం ఏంటంటే.. అక్కడ సీసీ కెమెరాలున్నాయి. వాటిని భద్రతా సిబ్బంది అనుక్షణం పరిశీలిస్తున్నారు. మన మీడియా మగానుభావుల ప్రవర్తన చూసి తెల్లోళ్ళు తెల్లబోయారు.  ఐతే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో వచ్చినందున, ఆ జర్నలిస్టులను ఏమీ అనకుండా... బైటకు పిలిచి మర్యాదగా, రహస్యంగా చెప్పారు. దాంతో సిగ్గుపడిన మన మిత్రులు తాము దొంగతనం చేసిన వెండి సామాన్లను మళ్ళీ వెనక్కి ఇచ్చేసారు.

సంబంధిత చిత్రం

కథ అక్కడితో అయిపోలేదు. ఒక మొగలాయి సంపాదకుడు అడ్డం తిరిగాడు. తాను ఏమీ దొంగతనం చేయలేదని బూకరించాడు. దాంతో తెల్ల పోలీసులకు సీసీటీవీ ఫుటేజ్ చూపక తప్పలేదు. ఈ మహాశయుడు తాను దొంగిలించిన వస్తువులను పక్కవాళ్ళ బ్యాగ్ లో దాచాడు. ఆ దృశ్యాలు చూపించి 50 పౌండ్ల జరిమానా విధిస్తే తప్ప సదరు జర్నలిస్టు కళ్ళు నేలకు దిగలేదు. అదన్నమాట సంగతి. ఆంగ్లపత్రిక ఔట్ లుక్ ఈ కక్కుర్తి బాగోతంపై వివరమైన కథనం ఇచ్చింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: