ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత ఎన్నికలలో మ్యానిఫెస్టోలో లేని ప్రకటించని పథకాన్ని రాష్ట్రంలో అద్భుతంగా అమలు చేస్తున్నారు. గతంలో ఏదైనా పార్టీ పతకం ప్రకటించింది అంటే దానికి మీడియాలో హడావిడి అంతా ఇంత  ఉండదు. అయితే ప్రస్తుతం  ప్రజల వద్దకు పాలన అనే క్రమంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడే పరిష్కారం అన్నట్టు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది.

ఒకప్పుడు రేషన్ కార్డు, ఆధర్ కార్డు, ఏదైనా  ప్రభుత్వానికి సంబంధించిన గుర్తింపు కార్డుల కొరకు ప్రజలు కాళ్లరిగేలా ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగేవారు. వారు వెళ్ళినా ఏ సమయానికి ఎవరు ఉంటారు ఎవరికి అర్థం అయ్యేది కాదు. అయితే ఈ క్రమంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమంలో ప్రజల వద్దకు పాలన అనే కార్యక్రమం కార్యరూపం దాల్చింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎక్కడ సమస్య అంటే అక్కడ పరిష్కారం అనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని కార్య రూపం దాల్చారు. ఈ కార్యక్రమంలో ఇల్లు లేని వారు, రేషన్ కార్డు లేని వారు,మరి అదే విధంగా ప్రభుత్వపరంగా రావలసిన ప్రతిదానిని జన్మభూమి కార్యక్రమంలో సంబంధిత అధికారిని ప్రశ్నించి వెంటనే పరిష్కారం పొందే దిశగా దీన్ని చేపట్టారు. చంద్రబాబు చేపట్టిన  ప్రజల వద్దకు పాలన అనే పథకం ద్వారా  రాష్ట్ర ప్రజలు ఎంతగానో సంతోషిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: