రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎవ‌రిది పై చేయి అవుతుందో చెప్ప‌డం క‌ష్టం. త‌మ‌కు తిరుగు లేద‌ని భావించే నేత‌లుకూడా బోర్లా ప‌డిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి కాంగ్రెస్ నేత‌, కొడంగ‌ల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఎదురైంది. త‌న పంచ్ డైలాగులతో విరుచుకుప‌డే రేవంత్ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు న‌చ్చ‌ని, త‌న‌కు ఎగ‌స్పార్టీ అనుకునేవారిని ఎవ‌రినీ వ‌ద‌ల‌కుండా విరుచుకుప‌డుతున్నారు. ప్ర‌ధానంగా సీఎం కేసీఆర్‌, ఆయ‌న టీంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఓటుకు నోటు కేసులోనూ ఆయ‌న జైలు నుంచి బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చాక ఏకంగా కేసీఆర్‌కు స‌వాలుగా మారాడు. ఇక‌, ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన రైతుల‌కు 24 గంట‌ల ఉచిత విద్యుత్‌పైనా రేవంత్ రెచ్చిపోయారు. ఈ విష‌యంలో స్కాం ఉంద‌ని, అందుకే కేసీఆర్ కొన్ని సంస్థ‌ల‌కే గుత్తాధిప‌త్యం అప్ప‌గించార‌ని విమ‌ర్శించారు. 

Image result for telangana

అయితే, ఇప్పుడు ఇదే రేవంత్‌కు అధికార పార్టీలో మొగుడు త‌యార‌య్యాడ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రేవంత్ త‌న‌కు ఎదురే లేకుండా మాట్లాడాడ‌ని, ఇప్పుడు ఈయ‌న‌కు దిమ్మ‌తిరిగేలా షాక్ ఇచ్చేందుకు టీఆర్ ఎస్‌లో ఎంపీ రెడీ అయ్యాడ‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఎంపీ బాల్క సుమ‌న్‌.. రేవంత్‌పై రెచ్చే గొట్టే కామెంట్ల‌తో రెచ్చిపోయారు. రేవంత్ రెడ్డి.. ఒక ర‌వ్వంత రెడ్డి అని హాట్ కామెంట్ల‌తో విరుచుకుప‌డ్డారు. అంతేకాదు, రేవంత్ చేసిన ప్ర‌తి విమ‌ర్శ‌కూ త‌న ద‌గ్గ‌ర స‌మాధానం ఉంద‌ని చెప్పారు. ``రేవంత్‌రెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నాం. విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై మేం చెప్పిన లెక్కలు తప్పైతే మేం ముక్కు నేలకురాస్తాం. మీరు చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే అబిడ్స్ సెంటర్‌లో ముక్కు నేలకు రాయాలి. బహిరంగ చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం.  అని బాల్కా సుమ‌న్ స‌వాల్ విసిరాడు.

Image result for trs

అంతేకాదు.. మా పార్టీ తరఫున నేను ఒక్కడిని చాలు.. నాతోపాటు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్ వస్తారు. మీ పార్టీ నుంచి ఉత్తమ్‌ను తీసుకొచ్చినా ఫర్వాలేదు. మీ సీఎల్పీనేత జానారెడ్డి, ఉపనేత జీవన్‌రెడ్డి అయినా సరే. లేదా మీ హయాంలో విద్యుత్ మంత్రిగా పనిచేసిన షబ్బీర్‌అలీ లేదా మంత్రులుగా పనిచేసిన వాళ్లంతా వచ్చినా సరే.. సమయం, స్థలం మీరే చెప్పండి.. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ లేదా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ అయినా అమరవీరుల స్థూపం వద్ద అయినా ఫర్వాలేదు. అని సుమ‌న్‌.. మ‌రింత గ‌ట్టిగా విరుచుకుప‌డ్డారు.  రేవంత్‌రెడ్డి చేసే ఆరోపణల్లో ప్రతి విషయానికి తాము వివరంగా లెక్కలు చెప్తామని, ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. . రేవంత్‌రెడ్డి రవ్వంతరెడ్డేనని ఎద్దేవాచేశారు. 

Image result for balka suman

మొత్తానికి బాల్క చేసిన వ్యాఖ్య‌లు టీ-కాంగ్రెస్‌లో ప్రకంప‌న‌లు సృష్టిస్తున్నాయి. అధికార పార్టీ కూడా త‌మ‌కు స‌వాల్ విసురుతుంద‌ని ఊహించ‌లేని నేత‌లు.. ఇప్పుడు ఏం మాట్లాడో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని ఫీల‌వుతున్న‌ట్టు స‌మాచారం. ఇక‌, రేవంత్ విష‌యానికి వ‌స్తే.. బాల్క సుమ‌న్ చేసిన వ్యాఖ్య‌లు కేవ‌లం రేవంత్‌ను రెచ్చ‌గొట్టేందుకేన‌ని స్ప‌ష్ట‌మ‌వుతున్నాయ‌ని అంటున్నారు  నేత‌లు. మ‌రి రేవంత్ ఈ వ్యాఖ్య‌ల‌పై ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. మొత్తానికి సుమన్ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: