జాతి విద్రోహ శక్తులు విలయతాండవం చేసేవేళ మానవత్వం మంటగలిసే సమయాన జాతి యావత్తు తమ తమ పద్దతుల్లో నిరసనలు విద్రోహుల గుండెల్లో చలిమంటలు పుట్టెలా తెలిపటం చాలా అవసరం. ఆ అవసరాన్ని గుర్తించిన ఒక టివి యాంకర్ తనదైన పద్దతిలో ఆ విద్రోహులకు తన నిరసన ప్రస్పుటంగా తెలిపింది. దానికి అమెను అభినందిద్ధాం.

Image result for samaa tv pakistan & kiran naz news reader with her child

 ఎనిమిదేళ్ల బాలికను అతి కిరాతకంగా అత్యాచారం చేసి, హత్య చేసిన అమానవీయ ఘటన పై పాకిస్థాన్‌ లో దేశ వ్యాప్తంగా  జనావళిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు నిరసనగా ప్రముఖ చానెల్‌ "సమా-టీవీ" లో ఒక యాంకర్‌ తన "చిన్నారి కూతురు" తో కలిసి వార్తలు చదవడం పలువురిని కదిలించింది. కిరణ్ నాజ్‌ అనే టివి న్యూస్ రీడర్ (యాంకర్‌) తన కూతురిని ఒడిలో కూచుబెట్టుకొని న్యూస్‌ బులిటెన్‌ను చదవడం ప్రారంభించింది.

Image result for samaa tv pakistan & kiran naz news reader with her child

"ఈ రోజు నేను కిరణ్ నాజ్‌ను కాదు. ఒక అమ్మను! అందుకే నా కూతురితోపాటు ఇక్కడ కూర్చున్నాను" అని ఆమె న్యూస్‌ రీడింగ్ ప్రారంభించారు. దేశంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆమె భావోద్వేగంగా 1.50 నిమిషాల పాటు మాట్లాడారు. "చిన్న శవపేటికలే అత్యంత బరువైనవనే మాట ఎంతో సత్యం. ఆ చిన్నారి శవపేటిక బరువును ఇప్పుడు యావత్‌ పాకిస్థాన్‌ మోస్తోంది" అని కిరణ్ నాజ్‌ ఉద్వేగంగా ఆర్ధ్రత పల్లవించే గొంతుకతో పేర్కొన్నారు.

Image result for samaa tv pakistan & kiran naz news reader with her child

Little innocent flower #Zainab Ameen was ready to see off her parents at airport for performing um-rah. But no one knows this was her last meeting with her ...

పంజాబ్‌ ప్రావిన్స్‌ లోని కసుర్‌ లో ఎనిమిదేళ బాలిక చిన్నారి జైనాబ్ అమీన్ పై వికృత పైశాచిక చర్యతో ఆనందం పోందిన ఆ త్రాష్టులను అంతమొందించాల్సిందే అంటూ నిరసనలతో  కిరాతకంగా అత్యాచారం, హత్య జరిగిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. పంజాబ్‌ ప్రావిన్స్‌ అంతటా ఈ అమానవీయ ఘటనకు రాక్షసత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలు చోటు చేసుకున్నాయి. భారత సరిహద్దుకు అతికొద్దీ దూరంలోనే కసూర్‌ పట్టణం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: