భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ40 విజయవంతమైంది. తనతో పాటు తీసుకెళ్లిన 31 శాటిలైట్లను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది.  శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో శుక్రవారం ఉదయం 9.29 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ–40 వాహక నౌక ద్వారా కార్టోశాట్‌–2 సిరీస్‌లోని మూడో ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి మోసుకెళ్లింది.
Image result for పీఎస్ఎల్వీ-సీ40
ఈ ప్రయోగంతో ఇస్రో చరిత్ర పుటల్లోకి ఎక్కింది.  ఈ ఉపగ్రహం సహాయంతో తుపాన్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది. మొత్తం 1323 కిలోల బరువును ఉపగ్రహవాహక నౌక తనతో పాటు తీసుకెళుతోంది. కార్టోశాట్-2 ఉపగ్రహం బరువు 710 కిలోలు. ప్రస్తుతం పీఎస్ఎల్వీ మూడవ దశ విజయవంతంగా ముగిసింది. రాకెట్ తన లక్ష్యం దిశగా దూసుకెళుతోంది. 
పీఎస్ఎల్వీ సీ 40
భారత్ కు చెందిన 100 ఉపగ్రహాలను ఇప్పటి వరకు నింగిలోకి పంపింది. గత ఆగస్టులో ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ విఫలమైన సంగతి తెలిసిందే. ఈ పరాజయంతో డీలా పడని ఇస్రో... మరింత పట్టుదలతో తాజా ప్రయోగాన్ని విజయవంతం చేసింది.  వీటిలో కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, కొరియా, యూకే, అమెరికాకు చెందిన ఉపగ్రహాలు ఉన్నాయి.
Image result for పీఎస్ఎల్వీ-సీ40
ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. భారతీయులకు ఇది న్యూ ఇయర్ గిఫ్ట్ అని ప్రకటించారు. 2013లో అమెరికా 29, 2014లో రష్యా 37 ఉపగ్రహాలను ఏకకాలంలో ప్రయోగించాయి. ఆ రికార్డులను భారత్‌ బద్దలు కొట్టడమే కాకుండా సమీపకాలంలో ఎవరూ అందుకోని రికార్డుకు చేరుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: