తెలుగు రాష్ట్రా్లో అప్పుడే ఎన్నికల మూడ్ వచ్చేసింది.. ఇంకా గట్టిగా ఎన్నికలకు ఏడాది కంటే ఎక్కువ సమయం లేదు.  ఇప్పటికే చంద్రబాబు, జగన్ ఎన్నికల కసరత్తులో బిజీగా ఉన్నారు. జగన్ పాదయత్రలో ఫుల్ బిజీ అయ్యారు. ఒక్కొక్క జిల్లా చుట్టుకుంటూ వస్తున్నారు. అటు చంద్రబాబు జన్మభూమి మా ఊరు కార్యక్రమం ద్వారా పార్టీని జనంలోకి తీసుకెళ్తున్నారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు తెచ్చుకుని పోలవరం ప్రాజెక్టును ఓ స్థాయిలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు.



ఐతే.. అటు టీడీపీ.. ఇటు వైసీపీ రెండింటి బలాలు బేరీజు వేస్తే.. జగన్ కు ఓ విషయంలో ప్లస్ పాయింట్ కనిపిస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ మీడియా వార్తలు ప్రాధాన్యం పెరుగుతుంది.. తటస్థ ఓటర్లను ఇవి బాగా ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం చంద్రబాబుకు అనుకూల మీడియా ఉంది. అందులో ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రధానమైనవవి వేరే చెప్పనక్కర్లేదు. ఇక జగన్ కు సాక్షి మీడియా అండ ఉన్న సంగతి తెలిసిందే. 



ఇక్కడ ఒక విషయం గమనించాలి. సాక్షి మీడియా నేరుగా జగన్ పర్యవేక్షణలోనే నడుస్తుంది. అది ఆయన సొంత మీడియా.. కానీ చంద్రబాబు పరిస్థితి అలా కాదు. ఆయన నేరుగా ఏ వార్త కూడా రాయించుకోలేరు. అనుకూల మీడియాపై ఆధారపడాల్సిందే.. దీని వల్ల ఆయన అనుకున్నప్పుడు ఎదురుదాడి చేయలేరు. కానీ జగన్ అలా కాదు.. ఏ వార్త అయినా ఎలా అయినా రాయించుకునే వెసులుబాటు ఉంది. 



కానీ.. అసలు జనం మీడియా వార్తలను నమ్ముతున్నారా.. మీడియా ద్వారా ప్రభావితమై ఓట్లు వేస్తారా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. కానీ మీడియా చేతిలో ఉన్నప్పుడు తమకు అనుకూలాంశాలను హైలెట్ చేసుకోవడమూ... ఎదుటి పార్టీ ప్రతికూల అంశాలు ఎదురైనప్పడు వాటిని జనం మరిచిపోకుండా గుర్తు చేయడమూ సులభమవుతుంది. ప్రస్తుతానికి చంద్రబాబుకు ఇలాంటి అవకాశం లేదు. మరి ఇది జగన్ కు ఎంతో కొంత ప్లస్ కాక మానదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: